ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఆనందమఠము


నుండిరి. ఎఱ్ఱమోము గలవాఁడు అందఱకు వెనుక గుఱ్ఱము నెక్కిపోవుచుండెను. ఎండ తాపము మిక్కుటముగా నున్నందున సిపాయీలు పగటి వేళ ప్రయాణము చేయక రాత్రి పూట ప్రయాణము చేయుచుండిరి ఇట్లు, ఇరసాలుబండితోఁగూడ పోవుచున్న సిపాయీలను మహేంద్రసింహుడు చూచి వారికి దారి విడుచుటకై కొంచెము ఒదిగి నిలిచెను. అయినను, సిపాయీలు వానిమీఁద పడుటకు వచ్చిరి. ఇది జగడమునకు సమయము కాదని మహేంద్ర సింహుఁడు రస్తా ప్రక్కన నున్న అడవియందున నిల్చెను.

ఒక సిపాయి, ఇదిగో దొంగ పరుగెత్తి పోవుచున్నాఁడని యఱచెను. మహేంద్రుని చేత తుపాకి యుండుటను జూచి వానికి వీఁడు దొంగ యనుట దృఢమైనది. ఆసిపాయి వానిని వెంబడించి పరుగిడి పట్టుకొని, దొంగముండాకొడుకా ! అని తిట్టుచు ఒక గుద్దు గుద్ది తుపాకిని లాగుకొనెను. మహేంద్రుఁడు వట్టిచేతివాఁ డైనందువలన సిపాయిగుద్దుకు బదులు తానొక గుద్దు గుద్దెను. మహేంద్రునికి అధిక కోపము కలిగిన డని వేఱుగఁ జెప్ప నక్కఱలేదు కదా. గుద్దుతిన్న సిపాయి తాళ లేక యట్లే నేలపైఁ బడిపోయెను. అపుడు నలుగురు సిపాయీలు వచ్చి మహేంద్ర సింహుని పట్టి యీడ్చుకొని పోయి సేనాపతి సాహేబుముందు నిలిపి, 'వీఁడు ఒక సిపాయిని ఖూని చేసినాఁ' డని రిపోర్టు(Report) చేసిరి. అపుడు సాహేబు పైపు(pipe) అనఁగా (చుట్టపట్టుకోవికి పేరు) పట్టుచుండినసేగాక, సారాయి త్రాగిన మత్తు చేతను కొంచెము విహ్వలుఁడై యుండినందున, “ఈదొంగముండాకొడుకును పట్టి 'షాదీ' (ఆనఁగా