ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డవ ప్రకరణము

31


అల్లినఖ్కి ఖా౯ బహధర్ అను తురక రాజు, సిరాజఉద్దౌలా సాహాయ్యమువలన దేశమును వృద్ధి చేసి కలకత్తానగరమునుకొల్ల గొట్టుకొని వచ్చియుండెను. ఆ తర్వాత క్లైవు వచ్చి యడుగు పెట్టిన వెంటనే తురకలు జన్మసార్థకము కోఱకు బేహ స్తికి (వీరస్వర్గముసకు) ప్రయాఱోన్ముఖు లైరి. బంగాళా దేశములోని ఇతర ప్రదేశములవలెనే వీరభూమి ఆదాయము కూడ ఇంగ్లీషువారు తీసికొనుట ప్రారంభించిరి. అయినను శాసనభారము రాజు చేతి యందే యుండెను. ఇంగ్లీషు వారు ఎచ్చ టేచ్చట పన్ను వసూలు చేసికొనుచుండిరో ఆయాస్థలములలో నొక్కొక కలెక్టరును నియమించి యుండిరి కాని, అప్పటివఱకు వీరభూమికి కలెక్టరును నియమించ లేదు. రాజే వారికొఱకు పన్ను వసూల్ చేసి కలకత్తాకుఁ బంపుచుండెను. ఆ కారణము చేత వీరభూమి ఆదాయము కలకత్తాకు ఇరసా లగుచుండెను. జనులు తినుటకు కూడు లేక చచ్చుచున్నను ఇరసాలుమాత్రము నిల్చుట లేదు. అపు డంతగా ఉత్పత్తియును "లేదు. ఏలన, భూమి చక్కఁగా పండుట లేదు. అది యెటులైన నుండనీ: ఆదాయము కొంచెముగా నున్నను దానిని బండిలో వేసి సిపాయీలపహరాతో కలకత్తా యందలి కంపెనీ ఖజానాకు పంపుచుండిరి. అప్పుడు దొంగలభయము అధికముగా నున్నందున ఏఁబదుగురు సిపాయీలు ఆ యుధపాణులై బండికి ముందు వెనుకల పహరా యిచ్చుచు పోవుచుందురు. వీరికి అధికారి ఒక యెఱ్ఱమూతివాఁ డుండెను. వాఁడు కంపెనీ వారి నౌకరుకాదు, ఆకాలమున దేశీయ రాజుల సైన్యములలో అనేకులు ఎఱ్ఱ మొగముగలవారు అధికారులుగా