ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

27


గాలేదు. పెద్ద బయలు. ఆబయలునందు అస్పష్టమైన వెన్నెల ప్రకాశించుచుండెను, వెలుతురు అంతగా లేనందున ఆ మైదానము తుద మొదలు తెలియ లేదు. మైదానములో నేమి యున్నదో, ఏదియు తెలియలేదు. చాల విస్తారమైన బయలు. జన శూన్యమైనది. భయమునకు నెలవు; షహరా అనెడి సైకత సముద్రమునకు సమానమైన యా మైదానమునందే మూర్షిదాబాదుకును కలకత్తాకును పోవునట్టిమార్గము. ఆ మార్గము ప్రక్కను నొక చిన్న కొండ గలదు. ఆకొండమీఁదుగా నచ్చ టచ్చట చెట్లు దట్టముగా నుండెను. చెట్లయాకులపై చంద్ర కిరణములు ప్రసరించుటచే తళతళ మెఱయుచు మర్మరశబ్దముతో కంపిత మగుచుండెను ఆ చెట్లనీడ కొండశిలలపైఁబడి చీఁకటి గావించుచుండెను. బ్రహ్మచారి ఆకొండపై నెక్కి దేనినో వినువానివలే చెవియొగ్గి ఆకాశమును చూచుచుండెను. విన్నదేమో, ఆశబ్ద మేమో, మనకు తెలియదు. తుద మొదలు లేని యాప్ర దేశమునం దేశబ్దమును లేదు. కేవలము వృక్షాదుల మర్మ శబ్దము తప్ప వేఱు లేదు. ఒక్క చోట పర్వత సమప్రదేశము. దానిసమీపమున పెద్దయడవి క్రిందుగా బాట నడుమ యడవి. అచ్చటి శబ్ద మేమో దానిని చెప్పుటకుఁ గానేరదు. బ్రహచారి ఆ ప్రక్కను పోయి యరణ్యమునం బ్రవేశించిచూడఁగా, నాయంధ కారమునందు గొందఱు గుంపులు గుంపులుగా చెట్ల క్రిందఁ గూర్చుండి యుండిరి. వారందఱును దీర్ఘాకృతి గల కృష్ణవర్ణ పురుషులు. అందఱును ముఖమును మూసికొని కూర్చుండి యుండిరి. ఆ వెన్నెలలో వారియొద్ద ఖరతరమైన ఆయుధము లున్నట్లు తెలిసెను. వీరు ఇన్నూఱుమున్నూఱుగు