ఈ పుట అచ్చుదిద్దబడ్డది

25

అయిదవ ప్రకరణము


అంత కల్యాణి, మరల నమస్కారము చేసి, 'నన్ను పాలు త్రాగుమని ఆజ్ఞ చేయఁగూడదు. దీనికొక యాటంకమున్నది అనెను.

వనవాసి అత్యంతదయతో, 'ఏమి ఆ యాటంకము? నాతోఁ జెప్పుము, నేను వనవాసిని, బ్రహచారిని, వృద్ధుఁడను. నీవు నా కుమార్తెవు, నాకుఁ జెప్పని దేమియు నుండదని తలంచెద. 'నేను నిన్ను అరణ్యమునందుండి పిలిచికొని వచ్చునప్పుడు నీవు చైతన్యవిహీనవై యుంటివి. మిగుల క్షుత్పిపొసా పీడితురాలవై యున్నావు. కొంచెము పాలు పుచ్చుకొనక పోవుదు వేని నీ ప్రాణ మెట్లు నిలుచును?' అనెను.

కల్యాణి ——కన్నీరు కార్చుచు, 'తాము దేవర్షి తుల్యులని నాయభిప్రాయము. తమకుఁ జెప్పని దేమున్నది? నాభర్త ఇంకను ఉపవాసము; అతనిం జూడకగాని, లేక ఆతఁడు భుజించిన సమాచారము తెలియక గాని, నేను దేనిని స్వీకరింపను' అనెను.

బ్రహచారి——'నీస్వామి యెచ్చట నున్నాఁడమ్మా!'యనెను.

కల్యాణి ——'నాకుఁ దెలియదు, పాలు తెచ్చెదనని బయలు దేరి పోయిరి. వెంటనే దొంగలు వచ్చి నన్నెత్తుకొనివచ్చిరి:' అనెను.

బ్రహ్మచారి, కల్యాణితో, ఒక్కొక ప్రశ్న వేసి యామె మాటల చేతనే యామెభర్త పోబడి యూహించి తెలిసికొనెను. కల్యాణి మగని పేరు చెప్ప లేదు. చెప్పుట దోషమా? మరల బ్రహచారి కల్యాణిమాటల చేతనే ఆమె మహేంద్రుని భార్య