ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఆనందమఠము


ఆగృహమునందు తన కెదురుగా ఆశుభ్ర శరీర శుభ్రవసన ధారి యైన మహాపురుషుఁడే కనఁబడెను.

కల్యాణి ఆశ్చర్యభరితురాలై, మరల దృష్టి నిగుడించి చూచెను. ఆమెకు స్మృతి యింకను సరిగా రాలేదు. అపు 'డా మహాపురుషుడు, 'అమ్మా! ఇది దేవత లుండు స్థానము, అనుమానము నుంచి కొనవద్దు, కొంచెము పాలున్నవి, వీనిని స్వీకరించుము, తర్వాత నీతో మాట్లాడెదను' అనెను.

కల్యాణికి మొదట నేమియుఁ దోఁపక, కొంచెము సేపు నకుమీఁద క్రమక్రమముగా మనస్సు స్థిరమయ్యెను, తెప్పిఱి లినపదంపడి, పై చెఱగు సవరించుకొని యామహాపురుషునకు నమస్కరించెను. అతఁడు మంగళా శీర్వచనము చేసి, వేఱోక గృహమునకుఁ బోయి సుగంధమైన మృత్పాత్రసుదెచ్చి, అందు పాలుపోసి కాచి, కల్యాణిచేతి కిచ్చి, అమ్మా కొంచెము పాలు బిడ్డకు పోసి, నీవు కొంచెము పుచ్చుకొనుము, తర్వాత మాట్లా డెద' ననెను.

కల్యాణి, సంతుష్టినొంది బిడ్డకు పాలు త్రాగించుటకు ప్రారంభించెను. ఆమహా పురుషుడు—— నేను పోయివచ్చెద, చింతింపవలదు. భయ మేమియు లేదు' అని చెప్పి వెడలి పోయెను. ఆతఁడు, కొంచెము సేపు తాళి వచ్చి చూచెను. చూచి కల్యాణి తనబిడ్డకుమాత్రము పాలుపోసి తాను పుచ్చు కొన లేదని తెలిసికొని, 'అమ్మా! నీ వేల పాలు త్రాగ లేదు, త్రాగుము' అని చెప్పి బయటపోవుటకుఁ బ్రయత్నించెను,