ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవప్రకరణము

23


శుభ్ర శరీర, శుభ్ర కేశ, శుభ్రశ్మశ్రు, శుక్రవసనధారి యైన ఋషిమూర్తిని దర్శించెను. అనన్య మనస్కురాలై తథాభూత చేతనమునందు ప్రణామము చేయుదు నని భావించెను. అయినను, ప్రణామము చేయఁజాలక తల వాంచెను. వెంటనే చేతన శూన్యురాలై భూతలశాయిని యైనది.


అయిదవ ప్రకరణము

మఠప్రవేశము

ఆవనమధ్యమునం దొక ప్రకాండమైన భూఖండమందు భగ్నమైన శిలాఖండములచే పరివేష్టితమైన మఠములు కలవు, పురాతత్త్వమును తెలిసినవారు చూచిరేని ఇది పూర్వకాలము నందు బౌద్ధుల విహారమైయుండి, అనంతరము హిందువుల మఠ మైనదని చెప్పుదురు. అది రెండంతస్థులు కలది, లోపల అనేక దేవమందిరము లున్నవి. ముందుగా నాట్యశాల కలదు. ఇవి యన్నియు నొకకోటచే ఆవరింపఁబడి యుండెను. దాని చుట్టును పెద్దవృక్షము లున్నందున పగటి వేళయందుఁ గూడ దీనిలోపల కోట యున్నదని తెలిసికొనుట కెవ్వరికిని సాధ్య ము కాదు. ఆమేడ లనేకస్థలములలో శిథిలమై యుండెను. ఇప్పుడు కొంతవఱకు జీర్ణోద్ధార మైనట్లు తోఁచెను. ఈమఠమున నొకగృహము. అందొక పెద్దదీప స్తంభమున దీపము వెలుఁగుచుండెను. కల్యాణి చైతన్యముకలిగి చూచినపుడు,