ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

నాల్గవ ప్రకరణము


నడుము నడుమ ఏడ్చుచుండెను, ఈశబ్దమును విని దొంగలు మఱియు నార్భాటము చేయుచుండిరి. కల్యాణి ఉపాయాంపరము లేక శరీరమంతము నెత్తుకు కారుచుండఁగా నావనమున పోవుచుండెను. కొంచెము సేపునకు చంద్రోదయ మైనది. ఇంతవఱకు కల్యాణి దొంగల చేతికిఁ జిక్కక దాఁగికొనుటకు అనుకూలముగా నుండెను. ఇప్పుడు చంద్రప్రకాశముచే దొంగలకు తానున్న చోటు తెలియుటకు వీలు కలిగినది. గదా యని చింతింపఁ దొడంగెను. ఇంతలో చంద్ర ప్రకాశమును అధికమాయెను, మొదట చెట్లతలమీఁద నున్న వెల్తురు తర్వాత భూమిమీఁదను ప్రసరింప నారంభించినందున, చీకటి దాఁగికొనియె. కల్యాణికి మాత్రము దాఁగుకొనుటకు స్థలము లేక పోయెను, మణికొంచెము దూరమున నిబిడమైన వృక్షములు కన్పట్టెను. అచ్చటికి పోయి దాఁగికొన వచ్చునని తలంచెను, అప్పుడు దొంగలు చీత్కారము చేయుచు వచ్చుచుండిరి. బిడ్డ వారికూఁత విని భయపడి యేడ్చుటకుఁ దొడంగెను. కల్యాణి ముందడుగు పెట్టుటకు ధైర్యము చాలక అట్లే నిలిచిపోయెను. ఒక పెద్ద చెట్టుక్రిందఁ గూర్చుండి బిడ్డను తొడపై పరుండఁ బెట్టుకొని, “దేవుఁడా! ఎక్కడున్నావు? నీకు కన్నులు లేవా? ఎవనిని ప్రతినిత్యమును పూజించుచున్నానో, ఎవనికి నిత్యమును నమస్కారము చేయుచున్నానో, ఎవని బలమువలన నీవనమధ్యమునం బ్రవేశించి వచ్చుటకు సమర్థురాల నైతినో ఆమహామహుఁ డిప్పుడెక్కడ! ఓమధుసూదనా ! నీవెక్కడనున్నావు! హాకృష్ణా ! నీవెక్కడికి పోయితివి?, అని ప్రలపించుచుండెను, ఆ సమయమునందు భయము చేతను, భక్తి