ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఆనందమఠము


యెను. ఒక్కఁడా నిర్జీవశవమును కాళ్లు పట్టి లాఁగి ఉప్పులో వేయుటకు ప్రయత్నించెను. వేఱోకఁడు — 'నిలు నిలుము ! మనము మహామాంసమును తిని ప్రాణమును సంరక్షించుకొను కాలము సంభవించినను, ఈముదిమానిసి మాంస మేల తినవలయును? నేఁడు మనము పట్టుకొనివచ్చిన స్త్రీమాంసమును తిందము' అనెను. మఱోకఁడు—— ఏదైననేమి, ఆఁకలిపోవుటయే ప్రధాన మనెను. అంత ఆందఱును కల్యాణీయు దానిబిడ్డను పరుండి యున్న చోటికిఁబోయిచూడఁగా, తల్లి బిడ్డలు కనఁబడ లేదు.

దొంగలు పరస్పరము జగడము చేయుచున్న సమయమున కల్యాణి బిడ్డను చంక నిడిగొని పాలిచ్చుచు పరుగిడి పోయెను. తర్వాత, ఆ ప్రేతమూర్తులైన దొంగలు సికారి పఱుగెత్తిపోయెను; పట్టుఁడు, కొట్టుఁడు, పఱుగిడుఁడు, అని కేకలు వేయుచు నలుదిక్కులకుఁ బాఱిరి. అవస్థావిశేషమునందు మనుష్యుఁడు అరణ్యహింస్రజంతు వేగాని వేఱుశాఁడుగదా.


నాల్గవ ప్రకరణము

వనప్రవేశము

అరణ్యము మహాంధకారమయము. కల్యాణికి మార్గము కనఁబడ లేదు. వృక్షలతా కంటకములు మిగులదట్టమై యున్నందున, మార్గము లేదు. అందును గాఢాంధకారము. 'కల్యాణి ఆచీకటిలో చెట్లసందులలో దూరి పోవుచు నుండెను. బిడ్డట్లయొక్కయు కంటకలతల యొక్కయు ముండ్లు గ్రుచ్చికొని