ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదియైదవ ప్రకరణము

235


నందు బహుకాలమునుండి బహిర్విషయిక మైనజ్ఞానము విలుప్తమై పోయినది. ఆర్యధర్మమును పునరుద్ధారము చేయవలసి వచ్చినచో, మొదట బహిర్విషయిక జ్ఞానమును బ్రచారము చేయవలయును. ఇప్పు డీ దేశంబున బహిర్వీషయిక మైనజ్ఞానమే లేదు. తెలిసి చెప్పెడివారును లేరు. మనము జనులకు నేర్పఁగల సమర్థులము కాము. అందువలన, వేఱే దేశమునుండి బహిర్విషయిక జ్ఞానము రావలయును. ఇంగ్లీషువారు బహిర్వీషయిక జ్ఞానమున పండితులు జనులకు నేర్పుటయందు సమర్థులై యున్నారు. కనుక నాంగి లేయులు రాజులు కావలయును ఇంగ్లీషు నేర్చినచో జనులు బహిర్విషయికజ్ఞానమున సుశిక్షితులై అంతస్తత్త్వమును దెలిసికొనుటకు సమర్థు లగుదురు. అపు డార్యధర్మ ప్రచారమునకు విఘ్నము సంభవింపదు అప్పుడు నిజధర్మము తనంతట పునరుద్దీప్త మగును. ఎన్ని దినము అట్లగుట లేదో ; యెన్ని దినములు హిందువులు జ్ఞానులగుటలేదో ; గుణాఢ్యు లగుట లేదో, బలిష్ఠులగుట లేదో , అన్ని దినములు ఇంగ్లీషు వారి రాజ్యము అక్షయముగా నుండును. వారి రాజ్యమునందు ప్రజలు సౌఖ్యము నొందుదురు నిష్కంటకముగా ధర్మాచరణము నాచరింపఁగలరు, కావున, వోబుద్ధిశాలీ! ఆంగ్లేయులతో యుద్ధము చేయక నన్ననుసరించి నా తోడరమ్ము.

సత్యానంద——మహాత్తా! ఆంగ్లేయులే రాజులుగ నుండ వలయు ననియును, ఆంగ్లేయుల రాజ్యమే యీ దేశంబునకు మం గళదాయక మైనదనియు దమకుఁ దెలిసియుండియు నీనృశంసమైన యుద్ధ కార్యమునందు నన్నేల నియమించితిరి?