ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

ఆనందమఠము


జీవానంద——శాంతీ ! నీవే శాస్త్ర సారమును దెలిసిన దానవు, నే నీ ప్రాయశ్చిత్తమును అసంపూర్తి చేయుట లేదు. నాసుఖము సంతానధర్మమందే—— ఆ సుఖమునందు వంచితుఁడ నయ్యెదను అయినను, పోవు టెచ్చటికి? మాతృసేవను మాని యింటికిఁ బోయి సుఖభోగముల ననుభవించుటకు వలను పడదుగదా.

శాంతి——నే నట్లు చెప్పుదునా! ఛీ! మన మింక గృహస్థులము కాము. ఇట్లే యిరువురమును సన్న్యాసులమై యుందము గాక—— చిర బ్రహ్మచర్యమును గాపాడుదము. నడువుము; దేశ దేశంబులందు చని తీర్థయాత్రలు చేసికొని యుందము.

జీవానంద——తర్వాత?

శాంతి—— తర్వాత హిమాలయమునందు కుటీరము నేర్పఱుచుకొని దేవతారాధన చేయుదము, దేనిచే మన మహామాతకు మంగళమగునో యావరమును వేఁడుదము.

అంత నాయిర్వురును లేచి యొకరి చేయి నొకరు పట్టుకొని నడుచుచు జోత్స్నామయమైన యర్ధరాత్రి యం దనంతమున నంతర్షితు లైరి.

హా తల్లీ! మరల 'రాఁగలరా? జీవానందునివంటి పుత్రుని శాంతివంటి పుత్రిని మరల గర్భంబునందు ధరియిం చెదవా?


నలుబదియైదవ ప్రకరణము

ఉపసంహారము

సత్యానందుఁడు రణ క్షేత్రమునుండి యెవ్వరికి నేమియుఁ జెప్పక ఆనందమఠంబునకు వెడలి పోయెను. అచ్చట నా గంభీర