ఈ పుట ఆమోదించబడ్డది

228

ఆనందమఠము


చుండెను. ఈమెయే శాంతి; జీవానందుని కళేబరమును వెదకుచుండెను.

శాంతిఏడ్చుచు పొరలాడుచుండిన సమయమునందు, అతి మధుర మైన సకరుణధ్వనిచే, “ ఏడ్చువా రెవరు? లేవమ్మా ! యేడ్వవలదు” అని చెప్పిన మాటలను విని, శాంతి తిరిగి చూడఁగా నెదుట నాజ్యోత్స్నాలోకంబునందు వెనుక నెపుడు చూడని జటాజూటధారియైన పురుషుఁడు నిలిచి యుండెను.

శాంతి ఏడ్చుచు లేచి నిలువంబడెను. వచ్చిన మహాపురుషుఁడు “ఏడ్వవలదమ్మా ! జీవానందుని దేహమును నేను వెదకి యిచ్చెదను, నాతోరమ్ము ” అనియెను.

అప్పు డతఁడు శాంతిని రణక్షేత్ర మధ్యస్థలంబునకుఁ బిలిచికొని పోయెను. అచ్చట అసంఖ్యేయములగు శవరాసులొకదానిపై నొకటిగా పడియుండెను. శాంతిచేత దానిని కదలించుటకు కాకపోయెను. ఆ బలిష్ఠుం డగు మహాపురుషుఁడు దానినంతయుఁ దీసి యొకశవమును వెలికిఁ దీసెను. దానినిఁ గాంచి శాంతి జీవానందని దేహ మని గుర్తించెను. సర్వాంగమును గాయములచే రక్తమయమై యుండెను. శాంతి చూచి సామాన్య స్త్రీవలె విలపింప నారంభించెను.

ఆ మహాపురుషుఁడు, మరల" ఏడ్వవలదమ్మా ! జీవానందుఁడు చావలేదు. స్థిరముగా నతని దేహమును పరీక్షించి చూడుము, మొదట నాడిని పట్టిచూడుము” అనియెను.

శాంతి శవము యొక్క నాడినిబట్టి చూచెను. కొంచెమైనను గతి లేదు. ఆపురుషుఁడు “ఱొమ్ముపై చేయి నిడి చూడు” మనియెను.