ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదినాలుగవ ప్రకరణము

227


చేయుచుండినవి; ఏవి ? నక్క.లు, కుక్కలు, గద్దలు, ఇవిగాక ఆ హతులైన జనుల క్షణిక మైన ఆర్తనాదము. కొందఱు ఛిన్నహస్తులు; కొందఱు ఛిన్న మస్తకులు; కొందఱకు కాళ్లు భగ్నములై యుండెను; కొందఱకు శరీరము చిల్లులుపడి పోయెను; కొందఱు గుఱ్ఱముల క్రిందఁ బడి యుండిరి; కొందఱు అమ్మా ! యనుచుండిరి; కొందఱు అయ్యా ! యని యఱచుచుండిరి; కొందఱు దాహము అనుచుండిరి; కొందఱు మూలుగుచుండిరి.బంగాళీలు, తురకలు, ఇంగ్లీషువారు, హిందూస్థానీలు, తెలగాలు, అఱవలు, అందఱు నేకత్ర జడజడిత మై మృతులైరి. ఆమాఘమాసపు పూర్ణిమా రాత్రి యందు ఆదారుణమైన శీతమున వెలుఁగుచుండు వెన్నెలయందు రణభూమి అతిభయంకరమై కానఁబడుచుండెను. అచ్చటికిఁ బోవుట కేవ్వరికిని దైర్యము లేదు.

ఎవ్వరును ధైర్యము చేసి పోలేదు. అయినను, ఆ యర్ధరాత్రి సమయంబున నొకరమణీమణీ ఆ యగమ్యమైన రణక్షేత్రంబున తిరుగుచుండెను. ఒక మషాలును వెలిఁగించుకొని దాని వెల్తురున నేమో వెదకుచుండెను. ప్రతిశవము యొక్క ముఖమును ఆవెల్తురులోఁ జూచుచుండెను. ఎచ్చటనైనను శవము గుఱ్ఱము క్రింద పడి యుండినచో, నాయువతీమణి చేతిలోనున్న వెల్తురుకట్టెను దిగువ నుంచి, గుఱ్ఱమును రెండు చేతులతో లాగివేసి ఆశవమును పరీక్షించి చూచును, ఈరీతిగా వెదకుచు నా రణ క్షేత్రము నంతయుఁదిరిగెను. వెదకుచుండినశవ మెక్కడను దొరక లేదు. అప్పుడు వెళ్తురును బాఱవైచి యాశవరాశి పూర్ణమైన రక్తమయభూమిపైఁ బడి యేడ్చుచు పొరలాడు