ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

ఆనందమఠము


లును విమోహితము లాయెను, వేగముగా మహేంద్రుని సంతాన వాహినీ ప్రవాహము పర్వతము నధిరోహణము సేయ నారంభించెను. శిలలచే ఘాత ప్రతిఘాతములై ప్రతి ప్రేరితమైన నిర్ఘరిణివలె రాజసైన్యము విలోడితమై స్తంభీభూతమై భీతితో పరుగిడి పోయెను. ఆసమయంబున నిరువదియైదు వేల సంతాన సైన్యమును దీసికొని స్వయముగా సత్యానంద బ్రహ్మచారి పర్వత శిఖరమునుండి యాంగ్లేయులపై సముద్రమే యుప్పొంగి వచ్చినట్లుగా పడెను. అత్యంతము భయంకరమైన యుద్ధము జరిగెను. ఎట్లు రెండు పెద్ద పెద్ద ఱాతిబండల సంఘర్షణము నడుమ నల్పమైన చీమలు చిక్కి పొడియై ధూళిపటలమై పోవునో, యట్లు రెండు సంతాన సేనల సంఘర్షణముచే నా విశాలమైన రాజసైన్యము పర్వతసాను దేశమున నలిగి పొడియై పోయెను.

వార౯ హేస్టింగ్సు నొద్దకుపోయి, ఈసమాచారమును దెల్పుటకుఁగూడ నొక్కఁడును "లేఁడు, అందఱును హతులైరి.


నలుబదినాలుగవ ప్రకరణము

సంతాన సేనా విజయము.

పూర్ణిమారాత్రి ! ——ఆభీషణం బగురణ క్షేత్ర మిప్పుడు స్థిర మాయెను, గుఱ్ఱంబుల పటపట శబ్దమును, తుపాకుల దడదడ శబ్దమును, ఫిరంగిగుండ్ల ఢంఢం శబ్దమును, సర్వవ్యాపకమైన ధూమమును లేదు. "హుర్రే ” అని చెప్పు వారును లేరు, హరిధ్వని చేయువారును లేరు. శబ్దముమాత్రము