ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదిమూఁడవప్రకరణము

225


ఱును మనస్సున సంతానులకు జయ మాయెను, శత్రువులను బాఱఁద్రోలి వచ్చుచున్నారని తెలిసికొని 'కొట్టుఁడు, శత్రు వులను నఱుకుఁడు' అని శబ్దము చేయుచు మరల నింగ్లీషువారి సైన్యముపైఁ బడిరి.

ఇచ్చట ఇంగ్లీషువారి సైన్యమునందు కలత కల్లెను. సిపాయీలు యుద్ధ ప్రయత్నమును మాని రెండు వైపులకు బాఱు చుండిరి. ఆంగ్లేయులు సహితము తుపాకులను దించుకొని శిబిరాభిముఖులై పాఱిరి. మహేంద్రుఁ డట్టిటు చూచుచుండఁగనే పర్వతశిఖరమం దనంతమైన సంతాన సైన్యమును గాంచెను. వారు వీరదర్పముతో దిగివచ్చుచు ఇంగ్లీషువారి సైన్యమును నాక్రమించుచుండిరి. మహేంద్రుఁ డెలుఁగెత్తి సంతానులను గూర్చి “సంతానులారా ! అట చూడుఁడు; తర్వత శిఖరంబున ప్రభువు సత్యానందగోస్వామి ధ్వజము కానఁబడు చున్నది. నేడు స్వయముగా మురారి యైన మధుకైటభ నిషూదనుఁడగు కంసకేశి 'రణ క్షేత్రమున వచ్చి యున్నాఁడు! పర్వతముపై లక్షసంతాను లున్నారు 'హరే మురారే! హరే మురారే! ' యని చెప్పుడు. లెండు; లేచి శత్రువుల ఱోమ్ము పగులునట్లు కొట్టుఁడు. లక్ష సంతానులు పర్వతముపై నున్నారు” అని చెప్పెను.

అప్పుడు 'హరేమురారె' అనెడి భీషణధ్వని పర్వతకంద రకాననన ప్రాంతర మెల్ల నిండి నిబిడీకృత మాయెను. సకల సంతా నులయొక్క “మాభైః మాభైః ” (భయమువద్దు భయమువద్దు) అను రవము లలితమైన తాళధ్వనియై, తళతళ మెఱయ నస్త్ర ముల ఝుణంఝుణశబ్దమునందు లయముకాఁగా సర్వజీవము