ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

ఆనందమఠము


నవీనానందునితో నేను వెడలిపోతి ననియును, లోకాంతరమునఁ జూచెద ననియును జెప్పు” మని చెప్పెను.

ఇట్లు చెప్పి యావీరపురుషుఁడు ఆలోహవృష్టి మధ్యమున గుఱ్ఱము నతి వేగముతో విడిచెను. ఎడమ చేతియందు బల్లెమును కుడిచేతియందు తుపాకియు నున్నది. నోట " హరే మురారే హరే మురారే” యనుశబ్దము. యుద్ధము చేయు ప్రయత్నమే లేదు ఇట్టిసాహసమువలన ఫల మేమియును లేదు. అయినను “హరే మురారే” అని పాడుచు జీవానందుఁడు శత్రువ్యూహ మధ్యంబునం బ్రవేశించెను.

పలాయనపరులైన సంతానులను సంబోధించి, మహేంద్రుఁడు “చూడుఁడు, ఒకతూరి వెనుకకుఁదిరిగి జీవానందగోస్వామిని చూడుఁడు, చూచినచో మీరు చావరు" అనియెను.

కొందఱు సంతానులు వెనుకకు దిరిగి జీవానందుని అమానుషకీర్తినిఁ జూచిరి. మొదట విస్మితు లైరి. పిదప, “జీవానందునికి మాత్రము చచ్చుటకుఁ దెలియునా? మాకుఁ దెలియదా? పదండి; జీవానందునితోడ మనమును వైకుంఠమునకుఁ బోవుదము" అనిరి.

దీనిని విని కొందఱు సంతానులు మరలిరి. వారినిఁ గాంచి యింకను గొందఱు మరలిరి. మఱియుఁ గొందఱు నట్లే చేసిరి. ఇందువలన మహాకోలాహల మాయెను. జీవానందుఁడు శత్రువ్యూహమధ్యమునఁ బ్రవేశించెను. సంతాను లెవ్వరును మరల నతనిని గాంచరైరి.

ఇచ్చట రణ క్షేత్రమునుండి సంతానులు చూచుచుండఁగనే కొందఱు సంతానులు వెనుకకుఁ దిరిగి వచ్చుచుండిరి. అంద