ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువదిమూడవప్రకరణము

221


జీవానందుఁడు నవ్వి "ఈదినము మహదానందము, కొండపైనను కొండ క్రింది భాగమునను సహా ఎడ్వర్ డ్సుదొర సైన్య మున్నది. ఎవరు ముందుగా పై కెక్కుదురో వారికి జయము" అని చెప్పి, సంతాన సైన్యమును గూర్చి గట్టిగా; "నే నెన రైనది తెలియునా ! నేను జీవానంద గోస్వామిని; ఆజయనదీ తీరమున అనేక వేల శత్రువుల ప్రాణవధ చేసిన వాఁడను; "అని చెప్పెను.

తక్షణమే తుముల నినాదముచే నాకానన ప్రాంతమంతయు ధ్వనిత మగునట్లుగా “ తాము జీవానందగోస్వామి యని యెఱుఁగుదుము” అని ప్రత్యుత్తర శబ్ద మాయెను.

జీవానంద——చెప్పుఁడు "హరే మురారే” అని.

అంత పర్వత కందర కానన ప్రాంతములయం దంతట వేల కొలఁది కంఠములనుండి "హరేమురారే" యని ధ్వనిత మాయెను.

జీవానంద——కొండ కాప్రక్కను శత్రువు లున్నారు. నేఁ డీపర్వతశిఖరమునందు ఈనీలాంబరియైన యామిని సాక్షాత్కారమై, సంతానులు యుద్ధము చేయవలయును; బిరాన రండు, ఎవరు ముందుగా శిఖరము నెక్కుదురో వారు జయింతురు, అని చెప్పుచున్నది. కనుక, రండు. "వందేమాతరం" అనుఁడు.

అప్పుడు భూమ్యాకాశములు నిండునట్లుగా “వందేమాతరం” గీతా శబ్ద మయ్యెను. సంతానసైన్యము మెల్ల మెల్లగా పర్వతారోహణము చేయ నారంభించెను. అయినను, ఆకస్తాత్తుగా మహేంద్ర సింహుఁడు తూర్యనాదము చేయుచు త్వరిత