ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

ఆనందమఠము


చాల కష్టము. మహేద్రుఁ డీకొండపై మజిలీ చేయుటకై యెక్కి చూచుకొని రావలయు నని యాలోచించెను.

ఇట్లు ఆలోచించుకొని మహేంద్రుఁడు గుఱ్ఱము నెక్కి మెల్లమెల్లగా పర్వతశిఖరంబును నెక్కఁజూ చెను. అతఁడు కొంచెము దూర మెక్కి పోఁగానే యొక వయస్కుఁడగు యోద్ధుఁడు వైష్ణవ సైన్యమధ్యమునఁ బ్రవేశించి "నడువుఁడు, పర్వతము పై నెక్కుఁ" డని చెప్పెను సమీపమున నుండు వారు "ఏల? ” యని యడిగిరి.

యోద్ధుఁ డొక జాతి బండపై నిలిచికొని, “నడువుఁడు, ఈవెన్నెలరాత్రియం దీపర్వత శిఖరంబున నూతనమైన వసంత నవీన కుసుమా ఘ్రాణము చేయుచు 'నేఁడు మనము శత్రువులతో జగడము చేయవలయు” ననియెను. చూడఁగా నతఁడు సేనాపతి జీవానందుఁడుగా నుండెను.

అప్పుడు గట్టిగా "హరే మురారే” అని శబ్దము నుచ్చరించుచు సైన్య మంతయు బల్లెముల నూనుకొని కొండపై కెక్కి దేవానందుని వెన్నంటి వడివడిగా పర్వతారోహణము చేయ నారంభించెను. ఒక్కఁడు తయారైన గుఱ్ఱమును జీవానందుఁ డెక్కుటకై తెచ్చి యిచ్చెను. మహేంద్రుఁడు దూరముగ నుండి చూచి విస్మితుఁడై "ఇదే మిది ! వీరు చెప్పక నే వచ్చుచున్నా' రని యనుకొనెను.

ఇట్లనుకొని మహేంద్రుఁడు గుఱ్ఱమును త్రిప్పి, దౌడా యించుచు దిగివచ్చి సంతానవాహినీపతియైన జీవానందుని: గాంచి "ఇదేమి; మరల ఆనంద మేమి;" అని యడిగెను.