ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది మూఁడవప్రకరణము

219


అప్పుడు “టిక్ టిక్ ఖట్ ఖట్” అని తంబుర శబ్దము కాఁగానే డేరాలు దొర్లుట కారంభమాయెను. మేఘరచితమైన అమరావతివలెనుండిన యావస్త్ర గృహ మంతర్జిత మాయెను. బండ్లపై మోపులవలేఁ బరిణమించెను. కొందఱు గుఱ్ఱములపై నెక్కిరి. కొందరు పాదచారులైరి. హిందువులు, ముసల్మానులు, మదరాసీలు, ఫరంగివారు అందఱును భుజములపై తుపాకులను మోసుకొని త్వరగా వెడలిరి. ఫిరంగిగుఁడ్ల బండ్లు గడగడమని పోవుచుండెను.

ఇంతలో మహేంద్రుడు సంతాన సైన్యమును దీసికొని క్రమక్రమముగా కేందుబిల్ల గ్రామాభిముఖుఁడై పోవుచుండెను. ప్రొదైనందున దారియందే నిలువపలయు నని యెంచి యుండెను.

శిబిరమును స్థాపించుటయే యుచితముగా నగుపడెను. అయినను, వైష్ణవులకు శిబిరములు లేవు చెట్లక్రింద గోనెపట్టలు పఱుచుకొని గంత బొంతలను కప్పుకొని నిద్ర చేసిరి. హరిచరణామృతమును గ్రోలి రాత్రి యంతయుఁ గడపిరి. క్షుద్బాధ యొక్కటే బాధించుచుండెను. దానికి స్వప్నమున వైష్ణవీ ఠాకూరాణుల యధరామృతమును ద్రావి కడుపు నింపుకొన వలయును. శిబిరంబునకుఁ దగినస్థలము సమీపముననే యుండెను. ఒకతోఁపు——అందు వేప మామిడి పనస మఱ్ఱి రావి మొదలగు గొప్పగొప్ప వృక్షము లుండెను. ఇచ్చట మజిలీ చేయవలయు నని మహేంద్రుఁడు ఉత్తరువు చేసెను. దాని సమీపముననే యొక కొండ గలదు. దాని నెక్కుట.