ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

ఆనందమఠము


సాధ్యము? లిండ్లె కాలు విఱిగి పడెను. శాంతి వాయు వేగముతో గుఱ్ఱమును దౌడాయించుకొని పోయెను.

శాంతి జీవానందుఁడు దాఁగియుండిన యరణ్యంబునకుఁ బోయి యతని కీసమాచారము నంతయుఁ జెప్పెను. అతఁడటు లైన నేను శీఘ్రముగా పోయి మహేంద్రుని హెచ్చరించెదను. నీవు కేందుబిల్ల గ్రామంబునకుఁ బోయి సత్యానందునికి సమాచారమును దెల్పుము, నీవు గుఱ్ఱము పైననే పొమ్ము, ప్రభువులకు శీఘ్రముగా సమాచారము చేరవలయును' అని చెప్పెను, అప్పుడా యిరువురును, ఒక్కోక్క దిక్కున కొక్కొకరుగా పాఱిరి. శాంతి మరల నవీనానందుఁ డాయె నని చెప్ప వలసినది ఆనావశ్యకము.


నలువది మూడవ ప్రకరణము

సంతాన సైనికులు భగ్నోత్సాహులగుట

ఎడ్వర్ డ్సు పక్కా ఇంగ్లీషువాఁడు. సామాన్యుఁడు కాఁడు. అచ్చటచ్చట జనులను ఉంచి యుండెను. శీఘ్రమున నా వైష్ణవి లిండ్లెను పడవేసి గుఱ్ఱము నెక్కుకొని యెచ్చటనో మాయమై వెడలిపోయె నని సమాచారము తెలిసెను. మేజరు ఎడ్వడ్సుదొర " An imp of satan ! strike the tents" కర్ణపిశాచిముండ! 'డేరాలను ఎత్తివేయుఁడు) అనెను.