ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది రెండవ ప్రకరణము

217


అప్పుడొక పెద్దయరబ్బీ గుఱ్ఱములగాము జీను వేయఁబడి తయారుగా వచ్చి నిలిచెను, శాంతిని పట్టి యెత్తి గుఱ్ఱముపైఁ గూర్చుండఁ బెట్టుటకై పోయెను. శాంతి, “ఛీ ! ఇంతమంది యెదుటనా ! నాకు లజ్జ లేదా ? ముందు నడువుము. ఎత్తైన చోట నెక్కు కోనేద" ననియెను.

లిండ్లె గుఱ్ఱమును నడిపించుకొని పోయెను. శాంతి వెనుక పోయెను. ఇట్టిరువుగును శిబిరమును విడిచిపోయిరి.

శిబిరమును విడిచి నిర్జన ప్రాంతంబునకుఁ బోయిన పిదప శాంతి లిండ్లె కాలిపై కాలు నుంచి యెగిరి గుఱ్ఱముపై నెక్కు కొనియెను.

లిండ్లె నవ్వి “నీవు పక్కా సవారు రాలవుగా నున్నావు " అనియెను.

శాంతి " నేనింత పక్కా సవారురాలను గనుకనే నీతో గుఱ్ఱము నెక్కుటకు సిగ్గాయెను. ఛీ ! ఛీ !! రికాబున కాలూని కొని గుఱ్ఱము నెక్కుదురా ! యనెను.

గర్వముతో లిండ్లె యొకమాటు రికాబునుండి కాలు దీసెను.

శాంతి యామూఢుఁడైన యింగ్లీషువానిని మెడబట్టి గుఱ్ఱమునుండి త్రోసివేసి గుఱ్ఱము పై నెక్కి కూర్చుండి కాలితోఁ గడుపుపై నొక తన్ను తన్ని వాయువేగముతో నాయరబ్బీ గుఱ్ఱమును దౌడాయించుకొని వెడలిపోయెను.

శాంతి నాలు గేండ్లుగా సంతానులసహవాసంబున మెలఁగి యుండినదిగాన గుఱ్ఱపుసవారి చక్కగా నేర్చుకొని యుండెను. అట్లు లేకుండినచో జీవానందునితోడ నెట్లు వసించుటకు