ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ ప్రకరణము

17


నందు 'నేనేల వారిని పొమ్మని చెప్పితిని? ఏమి చేయుదును? అని తలంచుచు, లోపలనైన పోయి 'తలుపు మూసికొని యుండెద' నని తలంచికొని లోపలికిఁబోయి తలుపును చూడగా తలుపు లేదు. ఉపాయాంతరము లేక దిక్కుతో చక అట్లే కూర్చుండి భర్త రాకకై నిరీక్షించుచుండెను. ఉన్నట్లుండి తన కెదురుగ నేదోనీడ కంటి కగపడెను. మనుష్యాకృతివలెఁ దోఁచెను. అయినను, మనుష్యుఁడే యని నిర్ధరించుటకు కాకుండెను, అతిశుష్కమై, శీర్ణమై, మిగులనల్లనై, నిర్వాణమై, వికటాకారమై, యుండు మనుష్య జంతువువలె నేదో వచ్చి ముందు నిలువఁబడెను. కొంచెము సేపటికి ఆఛాయాస్వరూపము ఆస్థిచర్మావ శిష్టమై యతిదీర్ఘమైన శుష్క హస్తమును పైకెత్తి యెవరినో సన్న చేసి పిలిచెను. దానింజూచి కల్యాణికి ప్రాణమేపోయినటు లయ్యెను. తర్వాత, మఱోకఛాయాస్వరూపము మున్ను చెప్పినట్లే వచ్చినది, ఇట్లోక దాని వెంబడి మఱోకటిగావచ్చి మున్ను నిలువంబడిన వికటాకృతిపార్శ్వమున వచ్చి నిలువంబడెను. అన్నియు, లోపలఁ బ్రవేశించెను, ఆచీఁక టిల్లు శ్మశానమువలెను, ఆవికృతస్వరూపములు ప్రేతములవలెను కనఁబడెను. అన్నియు కల్యాణి చుట్టువచ్చి నిల్చేను. కల్యాణి మూర్ఛ నొందెను. ఆ వికటస్వరూపులు కల్యాణినీ దానిబిడ్డను ఎత్తుకొని పొలము మీఁదఁబడి యరణ్యమును ప్రవేశించిరి.

అనంతరము, మహేంద్రుఁడు దుత్తలో పాలు తీసికొని వచ్చెను. వచ్చి చూడఁగా కల్యాణి లేదు. అచ్చటచ్చట వెదకి చూచెను. ఎచ్చటను కనఁబడ లేదు. మొదట బిడ్డ పేరు పెట్టి పిలిచెను. తర్వాత భార్య పేరు పెట్టి పిలిచేసు. ప్రత్యుత్తరమే