ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది రెండవ ప్రకరణము

శాంతి యెడ్వర్ డ్సును మోసపుచ్చుట

అపు డాయిరువురును నేమో మాటలాడు కొనిరి.మెల్లగా జీవానందుఁ డోకవనంబున దాఁగికొనియెను. శాంతియు మఱోకవనంబునఁ బ్రవేశించి యచ్చట నొక యద్భుతమైన రహస్య కార్యమునందు ప్రవృత్తురా లాయెను.

శాంతి చచ్చుటకై పోవుచుండెను; అయినను చచ్చు సమయంబున స్త్రీ వస్త్రములను ధరింపవలయు నని, స్థిరపఱిచి కొని యుండెను. ఆమెయొక్క పురుష వేషము మోసము చేయుటకుఁ దగినదని మహేంద్రుఁడు చెప్పి యుండెను, మోసము చేసి చచ్చుట సరికాదు. కావున, తన వెంట నొక తెల్ల చీరను దెచ్చి యుండెను. ఇంకను గొన్ని వస్తువులు నుండెను. నవీనానంద వేషమును దీసివేసి మాఱువేషమునఁ బ్రవృత్తురా లాయెను.

ముఖంబున కుంకుమముతో సూర్ధ్వపుండ్రము నుంచు కొని, వైష్ణవ స్త్రీ వేషముతో సారంగమును మీటుచు మనోహరముగ గానము చేయుచు నాంగ్లేయుల శిబిరంబునకుఁ బోయెను, ఆమెను చూచి సిపాయీలు మోహితు లైరి ఆమె కంఠమును విని జావళి పాడు మనిరి. కొందఱు కేదారగౌళ రాగము నాలాపనము చేయు మనిరి. కొందఱు కీర్తన పాడు మనిరి. కొందఱు కృష్ణుని విషయముగను, కొందఱు కాళికా విషయముగను, ఇట్లు నానావిధములుగాఁ జెప్పి, పాటలను పాడించి