ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

ఆనందమఠము


మహేంద్రుఁడు పదచిహ్న గ్రామంబున స్వల్పసంఖ్యగల సైన్యము నుండునట్లు నియమించి గొప్ప సైన్యమును దీసికొని కేందుబిల్ల గ్రామంబునకు బయలువెడలెను.

ఇవన్నియు జరుగుటకు మునుపే జీవానందుఁడును శాంతి యును పదచిహ్న గ్రామమునుండి వెడలిపోయిరి. అపుడు యుద్ధ సమాచార మేమియు నుండ లేదు. మాఘపూర్ణిమా పుణ్యదినమున శుభముహూర్తమునందు జయదేవగోస్వామి యొక్క తీర్థ మైన అజయనదీ పవిత్ర జలమున నాత్మ సమర్పణచే ప్రాణవిసర్జనము చేసి ప్రతిజ్ఞా భంగ మహాపాపంబునకుఁ బ్రాయశ్చిత్తము జేసికొనవలయు నని వారిరువురయొక్కయభిసంధియై యుండెను. అయినను, వారు త్రోవలోఁ బోవుచుండఁగా కేందుబిల్ల గ్రామంబునఁ జేరెడు సంతానులకు రాజసైనికులకును మహా ఘోరయుద్ధము కాఁబోవుచున్నదని వినిరి. జీవానందుఁ “డట్లైనచో యుద్ధముననే చచ్చిపోదము, నడువు" మనియెను.

వా రతి వేగముగా పోవుచుండిరి. మార్గమున నొకకోండ కనఁబడెను. అంత నాకొండ నెక్కి యావీరదంపతులు చూచిరి. కొంచెము దూరమున నాంగ్లేయుల శిబిరము కనఁబడెను. శాంతి——చచ్చుమాట యిపు డటుండనిమ్ము; “వందేమాతరం” చెప్పు మనియెను.