ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

ఆనందమఠము


మూసికొనియుండు మనుష్యుఁడుగా నగపడ లేదు. అతని కావిద్య తెలిసి యుండినచో నీకాలమందు భరతఖండమున బ్రిటిషు సామ్రాజ్య మెక్కడ నుండెను? పిమ్మట, మేజరు ఎడ్వర్డ్సు అను రెండవ సేనాపతి కొత్త సైన్యముతో కలకత్తాకు వచ్చి చేరెను.

ఎడ్వర్డ్సు కిది యూరోపియనుల యుధ్ధము కాదని తెలియవచ్చెను. శత్రువులకు సైన్యము లేదు. రాజధాని లేదు. కోటలు లేవు. అయినను అంతయు వారి యధీనమం దుండెనని తెలిసినది ఏదిన మెచ్చట బ్రిటీష్ నేనాశిబిరమో యాదినము మాత్రము ఆస్థలము బ్రిటీష్ సేనాధీనమై యుండును. మఱుదినము బ్రిటీష్ సేన యాస్థలమును విడిచి పోయినచో నాల్గు దిక్కులందును “వందే మాతరం” పాడఁబడును. ఎక్కడ నుండియో చీమలబారుతీరుగా రాత్రియం దింతమంది వచ్చి యాంగ్లేయుల వశమం దున్న గ్రామములను కాల్చుటయును స్వల్పసంఖ్యగల బ్రిటిష్ సేన చిక్కినచో నాక్షణమే ధ్వంసము చేయుటయును ఎడ్వర్ డ్సుదొర తెలిసికొనఁజాలక పోయెను. తుదకు ఆనేనాపతి, పదచిహ్న గ్రామంబున కోటను గట్టుకొని యచటనే తమయాయుధశాలను ధనాగారమును నిర్మించికొని యున్నారని తెలిసికొనెను. కావున, అతఁడు ఆదుర్గమును పట్టు కొనవలయు ననెడి ప్రతిజ్ఞ కలవాఁ డాయెను.

ఎడ్వర్ డ్సు, గూఢచారులవలన పదచిహ్నమున నుండు సంతానులసంఖ్యను దెలిసికొనెనుగాని, వెంటనే యాదుర్గము నాక్రమించుటకు ధైర్యము లేకపోయెను. అయినను మనస్సునందొక యపూర్వమైన కౌశలము నేర్పాటు చేసికొనియెను,