ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువదియొకటవ ప్రకరణము

209


నెను. మహేంద్రుని యభిమతంబు నెఱింగి కల్యాణి, “ఈమె బ్రహ్మచారిణి” యనెను.

మహేంద్రుఁడు విషణ్ణుఁడై, అయినను, ప్రాయశ్చిత్త మున్న దని చెప్పి, శాంతి ముఖమును జూచుచుఁ "బ్రాయశ్చిత్త మేమి? తమకుఁ దెలియునా” యనెను.

శాంతి——మరణము, ఇది ఏసంతానునికిఁ దెలియదు? రాఁగల మాఘశుద్ధ పూర్ణిమ నాఁడు ఆప్రాయశ్చిత్తము కావలయు నని నిశ్చయింపఁబడినది. తాము నిశ్చింతతో నుండుఁడు.

ఈమాటను జెప్పి శాంతి యచటనుండి వెడలిపోయెను. మహేంద్రుడును కల్యాణియు వజ్రాహతు లైన వారివలెనే నిలుచుకొని యుండిరి.


నలువదియొకటవ ప్రకరణము

వ ప్రకరణము

ఎడ్వర్ డ్సు దీర్ఘాలోచనము

ఉత్తరబంగాళము ముసల్మానుల చేయి విడిచి పోయెను. అయినను ముసల్తాను లెవ్వరును ఈమాట చెప్పుకొనుటయు లేదు! ఒప్పుకొనుటయు లేదు. కొందఱు దుర్మార్గులు అపుడపుడు సమయము చూచి హిందువులను తొందర చేయుచుండిరి. అందఱును పట్టి తెచ్చునట్లును చెప్పుచుండిరి, ఇట్లు చాల దినములు చెప్పుచుండిరి కాని, యాపని జరుగలేదు. ఈ సమయంబున భగవదాజ్ఞచే కలకత్తాయందు వార౯ హేస్టింగ్సు గవర్నరుజనరలుగా నుండెను. వార౯ హేస్టింగ్సు కన్నులు