ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

ఆనందమఠము


రమణియొక్క కటాక్షముగా నుండెను. సాహస ధైర్యములతో నవీనానందుని గడ్డమునుబట్టి యీడ్పెను. కృత్రిమగడ్డమును మీసములును చేతికి వచ్చెను. ఆసమయంబున కల్యాణి అవకాశమును గైకొని పులిచర్మము ముడిని విప్పి వేసెను, చర్మము క్రింద పడిపోయెను.

శాంతియు——నేలపైఁబడి అవనతముఖి యాయెను.

మహేంద్ర——నీ వెవ్వరు? అని యడిగెను.

శాంతి——నేను శ్రీమాన్ నవీనానందగోస్వామి.

మహేంద్ర——అది దొంగ వేషము. నీవు స్త్రీ వే?

శాంతి——ఇప్పుడు యత్నము తప్పెను.

మహేంద్ర——ఇప్పుడుమఱోక్కటియడిగెదను—— నీవాఁడుదానవై యుండి సదా జీవానందఠాకూరు సహవాసముననే యుండెద వేల?

శాంతి——దానిని తమతో నేను జెప్పలేను.

మహేంద్ర——నీవు వనితవు. జీవానందఠాకూరు నెఱుఁగుదువా?

శాంతి——ఎఱుఁగుదును.

దీనిని విశుద్ధాత్ముఁడైన మహేంద్రుఁడు విని కందిన మోముగలవాఁ డాయెను. ఇఁక నిజము చెప్పవలయు నని తలంచి కల్యాణి, “ఈమె జీవానందగోస్వామి యొక్క ధర్మపత్ని యగు శాంతిదేవి" యనెను.

ఒక ముహూర్తమాత్రము మహేంద్రు నిముఖము ప్రఫుల్లమాయెను. మరల నాముఖమున నంధకారము క్రమ్ముకో