ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదియవ ప్రకరణము

207


నవీనానంద——నన్ను నమ్మక యుండవచ్చును——కల్యాణిపై అపనమ్మక ముంచుట న్యాయమా?

మహేంద్రున కేమియుఁ దోఁచక అప్రతిభుఁడై “ఎపుడు, ఎందులకు నమ్మకయుంటిని” అనెను.

నవీనానంద——ఆట్లు కాకున్నచో నా వెను వెంటనే యంతఃపురంబునకు రావలసిన దేల?

మహేంద్ర——కల్యాణీతో నాకుఁ బని యుండెను; అందులకై వచ్చితిని.

నవీనానంద——అట్లయినచో నిప్పుడు కల్యాణితో నాకును గోంచెము పని యున్నది; దయచేసి తాము వెడలిపోయి నచో నేను మొదట మాటలాడి పోయెదను. ఇల్లు వాఁకిలి తమది. కల్యాణి తమది. తా మెప్పుడు తలఁచినను మాటలాడ వచ్చును. నేను కష్టపడి యొక్కతూరి వచ్చినవాఁడను.

మహేంద్రుఁడు మూఁగవానివలె నిలిచెను. ఏమియుఁ దోఁచకుండెను. ఆపలుకులను వినఁగా అపరాధిమాటలుగా నుండ లేదు. కల్యాణీ యొక్క భావము విచిత్రమై యుండెను. ఆమెయు అవిశ్వాసినివలె పాఱిపో లేదు, భయపడ లేదు, లజ్జితురాలు కాలేదు——కొంచెము చిఱునవ్వు నవ్వుచుండెను. మఱియు కల్యాణి యా చెట్టు క్రింద నిరాయాసముగా విషమును మ్రింగినట్టిది. అట్టిది యపరాధి యగునా ! మహేంద్రుఁ డిట్లు చింతించుచున్న సమయంబున అభాగినియైనశాంతి మహేం ద్రుని దురవస్థను గాంచి కొంచెము నవ్వి, కల్యాణిని విలోల కటాక్షముతోఁ జూచెను. అపు డాకస్మికముగా నంధకారమున వెల్తురు కలిగిన ట్లాయెను. మహేంద్రుఁడు చూడఁగా అది