ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదియవ ప్రకరణము

205


బొమ్మల సామానులను దెచ్చి జీవానందుని ముందు పడవైచెను. సుకుమారి వానినన్నటిని గుంపుగాఁ జేసి, నిమాయినిఁ జూచి, “అమ్మా! అమ్మా! యెచ్చటికి పోవలెనమ్మా? ఇదంతాయెందుకమ్మా!" ఆనియడిగెను. నిమాయి కిఁక సహించుటకుఁ గాలేదు. అప్పుడామె సుకుమారి నెత్తుకొని యేడ్చుచు వెడలిపోయెను.

“కన్న మరులుకన్న సాఁకినమరు లెక్కువ” అనుదానికిదే సాక్షి.


నలుబదియవ ప్రకరణము

మహేంద్రుని మనోవిచారము

పదచిహ్న గ్రామంబున నూతనముగా నిర్మింపఁబడిన దుర్గమధ్యమునందు నేఁటిదినము మహేంద్రుఁడు, కల్యాణి, జీవానందుఁడు, శాంతి, నిమాయిమణి, నిమాయిమణిపతి, సుకుమారి, వీరందఱును సుఖముగాఁ జేరి యుండిరి. శాంతి నవీనానంద వేషముతోనే యుండెను. కల్యాణినిఁ బిలిచి కొనివచ్చిన నాఁటి రాత్రి యామె కల్యాణికి మగనితో తా నాఁడుది యని తెలుపవలదని చెప్పి యుండెను. ఒకనాఁడు కల్యాణి శాంతిని తన యంతఃపురమునకుఁ బిలిపించెను. నవీనానందుఁ డంతఃపురమునకుఁ బోయెను. కావలివారు ఆటంకము చేసినను వినక లోపలికిఁ బోయెను.

శాంతి కల్యాణినిఁ జూచి——'నన్నేల రప్పించితి' వని యడిగెను.