ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

ఆనందమఠము


శాంతి జీవానందుని ముఖమును జూచి, “నేను కొంచెము పరుండెదను, ఈ దినమంతయు నొకచోటఁ గూర్చుండ లేదు. 'రెండు రాత్రులుగా నిద్రయే లేదు” అనెను.

కల్యాణి కొంచెము నవ్వెను. జీవానందుఁడు మహేంద్రునిఁ జూచి, “ఆభారము నాయం దున్నది, మీరు పదచిహ్నగ్రా మంబునకుఁ బొండు. అచ్చటికే బిడ్డ వచ్చు” ననెను.

జీవానందుఁడు భైరవపురంబునకు నిమాయిమణియొద్ద నుండిన బిడ్డను తెచ్చుటకై వెడలిపోయెను, చేయఁబూనినపని సులభ మైనదిగాఁ గనఁబడ లేదు.

మొదట, నిమాయిమణి గుటకలు మ్రింగెను. అటునిటు చూచెను. పిదప నాసాపుటములు వికసితమాయెను. తర్వాత యేడ్చెను.

నిమాయిమణి గుండ్రముగను ముద్దుగను నుండిన ముంజేతితోఁ గన్నుల నులిమి నులిమి తుడిచికొన్న పిదప, జీవానందుఁ డు, “ఏమమ్మా! యేడ్చు టేల ఆచోటు దూరము కాదు, వారి యింటికిఁ బోయి అప్పుడప్పుడు చూచుకొని రావచ్చును. కష్ట మేమియు లే" దనియెను

నిమాయిమణి వికసిత నాసాపుటయై, “శిశువేమోనీది నీవే పిలుచుకొనిపో, నాకేల”అని చెప్పి సుకుమారినిఁబిలుచుకొని వచ్చి జీవానందునియొద్ద కోపముతోఁ గూర్చుండఁ బెట్టి, యొక మూల పోయి కూర్చుండి కన్నీరు నించెను. యత్నము లేక జీవానందుఁ డిం కేమియు జెప్పక ఆమాట లీమాట లెత్తెను, అయినను, నిమాయిమణి కోప మాఱ లేదు, ఆమె లేచి పోయి సుకుమారియొక్క బట్టలమూటను సొమ్ముల పెట్టెను