ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదితోమ్మిదవప్రకరణము

203


జీవానందుఁడు భవానం దునివలన కల్యాణి యొక్క పునరుజ్జీవనవిధమునంతయు విని యుండెను,మఱియు నామె యప్పుడు వసించుచుండిన వాసస్థానమును ఆసర్వస్థానవిచారిణియైన శాంతివలనఁ దెలిసికొని యుండెను. కనుక, వాఁడు ఈకథ నంతయు మహేంద్రునికిఁ దెల్పెను.

మహేంద్రుఁడు విని మొదట నమ్మలేదు. తుదకు ఆనంద సాగరమగ్నుఁడై ముగ్ధ ప్రాయుఁ డాయెను.

ఆదినము రజనీ ప్రభాత సమయంబున శాంతియొక్క సహాయముచేఁ గల్యాణికి మహేంద్రుని దర్శన మాయెసు, నిశ్శబ్దమగు కానన మధ్యంబున దట్టముగాఁ బెరిగి యుండిన చెట్లనీడల యంధకారచ్ఛాయయందు పశుపక్షులకు నిద్రాభంగ మగుటకుఁ బూర్వమే వారికి పరస్పరదర్శనలాభము గలిగెను. దీనికి సాక్షులు—— కేవలము ఆనీలమైన గగనవిహారులగు మ్లానకిరణములు గల నక్షత్ర విచయమును, గాలి లేక నిష్కంపముగ నిలిచియుండిన యనంతమైన తరువులును దూరముగా శిలలపైఁ బడి పొగలి మొఱలిడుచు వచ్చుచుండు మధుర కల్లోలిని యైన సంకీర్ణ నదీ ఝుర్ఘర శబ్దమును, ఎచ్చటనో దూరముగ పూర్వ దిగ్భాగమందు సముదితమైన ఉషామకుట కాంతినిఁ జూచి యాహ్లాద మొంది కూయుచుండు కోకిలద్వనియునే.

తెల్ల వాఱుట కింకను నొకజా ముండెను, అచ్చటికి శాంతియును జీవానందుఁడును వచ్చి దర్శన మొసంగిరి. కల్యాణి శాంతినిఁగూర్చి “మీకు మేము మూల్యము లేని విక్రీతులమై యున్నాము. మాకొమార్తెను వెదకి యిచ్చి యుపకారఫలమును సం పూర్ణముగాఁ బొందుఁ" డనియెను.