ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

ఆనందమఠము


డిరి. దీనినంతయుఁ జూచి, కల్యాణికి మిక్కిలి కష్టము సంభవించెను, మార్గము తెలియదు. ఎవరినైన నడిగి తెలిసికొటకును వీలు లేదు. అందఱును రణోత్సాహులై యుండిరి. కేవలము చీఁకటియందు పొంచికొని పోవలయును. అచ్చ టచ్చట వచ్చెడు వారిని పోయెడు వారిని పట్టుకొని పోవుచుండిరి.కల్యాణిమహోద్ధతులును ఉన్మత్తులునగు నొకవిద్రోహుల చేతికిఁజిక్కెను. వారతి ఘోరమైన ధ్వని చేయుచు నామెను పట్టుకొనిరి. కల్యాణి నిట్టూర్పు విడిచి తప్పించుకొని పరుగిడి యడవింబడెను. అక్కడఁ గూడఁ గొందఱు దొంగలు వెంబడించిరి. ఒకఁడు పాఱి వచ్చి యామె చెఱఁగుఁబట్టి, “ఓచంద్రబింబాననా!" యనెను, ఆసమయమున నింకొకఁ డకస్మాత్తుగా వచ్చి, యాదురాచారియైనదోంగను నొక్క దెబ్బకే నేలం బడునట్లు తన్నెను. వాఁడు దెబ్బతిని పాఱిపోయెను. ఆతన్నినవాఁడు సన్న్యాసి. కావి వస్త్రము గట్టి యుండెను. కృష్ణాజినముచే నావృతవక్షుఁడై యుండెను. బాల్య వయస్సు గలవాఁడు. అతఁడు కల్యాణిని “భయపడ వలదు, నాతో డరమ్ము, ఎక్కడికిఁ బోయెద” వని యడిగెను.

కల్యాణి——పదచిహ్న గ్రామంబునకు.

ఆగంతుకుఁడు చమత్కృతుఁడై యాశ్చర్యపడి “పదచిహ్న గ్రామంబున కేల” అని యడిగి, తనయెదుట నిలిచియుండిన కల్యాణి భుజముపై చేయిడి యాచీకటిలోనే యామెను గుర్తించి చూచుచుండెను.

కల్యాణి, పురుషస్పర్శముచే రోమాంచయై భయాశ్చర్యాన్వితురాలై చింతించుచు కన్నీరు నించెను. పరుగెత్తి పోవు