ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియెనిమిదవ ప్రకరణము

199


రావాఁడు, 'పోవుటకు ఉత్తరవు లే' దనెను. ఈసమాచారము దఫేదారు చెవినిఁ బడెను దఫేదారు 'బయటికి పోవుట యందు నిషేధము లేదుగాని, లోపలికి రాను మాత్రమే యుత్తరవులే' దనియెను. ఆమాటవిని, పహరావాఁడు కల్యాణిని జూచి, “పోఅమ్మా: పోవుట కడ్డు లేదఁట. ఈదినమురాత్రి నిండా ఆపద; నీ వేమయ్యెదవో చెప్ప లేను; నీవు దొంగల చేత దొరకుదువు; దొరకితివా చచ్చుట నిజము; నామాటను విను మమ్మా? ఈదినము రాత్రి బయటికి పోవద్దు; ఇక నీ యిష్టము" అనెను.

కల్యాణి——అన్నా; భిక్షుకురాలను—— నాయొద్ద నొకకాసైన లేదు. దొంగలు నన్నేమి చేయుదురు?

పహరావాడు యౌవన మున్నదిగదా! తల్లీ! ప్రపంచమున యౌవనమే సకలాభరణసంపదలు—— చూడఁగా నీయం దది మహదైశ్యర్యముగా నున్న 'దనెను.—— కల్యాణి, ఏమో యది యొక విపత్తనియనుకొని, యేమియు మాఱాడక 'మెల్ల మెల్లగా నాస్థలమునుండి తప్పించుకొని వెడిలి పోయెను, పహరా వాఁడు, 'ఈ యాఁడుది రసికత్వమును దెలిసికొనక వెడలిపోయే' నని మనస్సులో ఖేదపడి యొక “దం” గంజాయి త్రాగి ఊగులాడుచు కరతాళము వేయుచు “ఝో తకదై” అని పాడుట కారంభించెను.

ఆరాత్రి మార్గమున పధికులు కొందఱు 'కొట్టుఁడు కొట్టుఁ' డనియును; కోందఱు 'ఉఱుకుఁడు ఉఱుకుఁ' డనియును, కూతలు వెట్టుచుండిరి. కొంద ఱేడ్చుచుండిరి; కొందఱు నవ్వుచుండిరి. చేతికి దొరకినవారినిఁ బట్టికొని పోవుచుం