ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

ఆనందమఠము


మింపఁబడిరి. రాజధానియందు సమస్త జనులును రాత్రియంతయు జాగరణము చేయుచు నేనుగునో యని చింతించు చుండిరి. హిందువు లందఱును, “రానీ, సన్న్యాసులు రానీ, తల్లి దుర్గా దేవి యట్లే చేయనీ, హిందువుల యదృష్టము ఫలింపనీ” అని చెప్పుచుండిరి. ముసల్మానులు “అల్లా ఒ అక్బర్ ! మే మైదు పూటలు నమాజు చేసెదము. ఈహిందువుల గొట్టుటకుఁ గాలేదు. దునియా (ప్రపంచము) యంతయు ఝూట్ (అబద్ధము) " అని యేడ్చుచుండిరి. ఇట్లు కొందఱు నవ్వుచును, కొందఱు ఏడ్చుచు నుండిరి. అందఱును బహుభయముతో నారాత్రిని గడపిరి.

ఈవృత్తాంత మంతయు కల్యాణి చెవినిబడెను. ఆ బాల వృద్ధవనితలును వినకయుండ లేదు. కల్యాణీ మనస్సున " జయ జగదీశ హరే' నేఁడు కార్యసిద్ధి యాయెను. 'నేను నేఁడు నా స్వామి సందర్శనార్థమై యాత్ర చేసెదను. ఓ మధుసూదనా! నేఁడు నాకు సహాయ మొనర్పము” అని భావించికొనియెను.

గభీర మైన రాత్రి కాలమున కల్యాణి శయ్యను విడిచి లేచియొక్క తెయే దొడ్డితలుపు దెఱచి, యట్టిటు చూచి యెచ్చట నెవ్వరు లేరని తెలిసికొని మెల్ల మెల్లగా, గౌరీదేవి యంతఃపురమును విడిచి రాజవీధికి వచ్చెను మసస్సున నిష్ట దేవతను స్మరించికొని, “నేఁడు వారిని నేను పదచిహ్న గ్రామంబునఁ జూడ వలయును” అని తలంచికొనెను.

కల్యాణి నగరద్వార సమీపమున వచ్చి నిలిచెను. పహరా వాఁడు, “ఎవరీ వేళకు పోవువారు” అనెను. కల్యాణి,భయభ్యాం తురాలై దీనస్వరముతో "నే నాఁడు దానను” అనెను. పహ