ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియెనిమిదవ ప్రకరణము

197


దఱు అంగళ్లను కొల్లగొట్టిరి, కొందఱు గొల్లల యిండ్లలోఁ బ్రవేశించి కుండ చట్లను బగులగొట్టి పాలును పెరుగును ద్రాగిరి. కొందఱు 'మేమువ్రజగోపాలురము వచ్చి యున్నారము. గోవు లెక్కడ' నని యడుగుచుండిరి. ఇట్లు సంతానులు నానా విధములుగాఁ బ్రవర్తించుచు బోవుచుండిరి. ఆయొక్క నాఁటి రాత్రి గ్రామంబులందును నగరంబులందును మహాకోలాహల ముగ నుండెను, తురకలందఱును పరుగిడి పోయిరి. హిందువులకు రాజ్య మాయెను. అందఱును “హరీ హరీ” యని చెప్పుఁడని యఱచుచుండిరి. పల్లెటూళ్ల వారుగూడ ముసల్మాను లగపడినచోఁ గొట్టి పాఱఁద్రోలుచుండిరి, కొందఱు కొందఱు గుంపులు గుంపులుగాఁ జేరి ముసల్మానుల కొంపలకు నిప్పు బెట్టి యున్న దానిని దోఁచుకొని పోవుచుండిరి. అనేక యవనులు హతులైరి. అనేక ముసల్మానులు గడ్డములను గొఱిగించు కొని చందనమును బూసికొని హరినామమును జెప్పుటకారంభించిరి. ఎవరైనను అడిగిన " నేను హండు (హిందు)” అని చెప్పుచుండిరి.

ముసల్మానులు భయపడి నగరాభిముఖులై పరుగిడిరి. ఎచట మహా రాజా వీరభూమ్యాధిపతి యైన అసదుల్ జమా౯ బహద్దరు రాజసింహాసనమునఁ గూర్చుండి యుండెనో, అచ్చటికీ దారుణ మైన రాజ్య ధ్వంస సూచక మగు వార్త అందినది, అప్పుడు వ్యాకులచిత్తులై రాజపురుషులు నలుదిక్కులకు వెడలి పోయిరి. రాజుయొక్క మిగిలిన సిపాయీలు వస్త్ర ధారులై శస్త్ర పాణులై నగరరక్షణార్థము వరుసగా నిలిచిరి. రాజనగరకోటయం దచ్చటచ్చట శస్త్ర పాణులై రక్షకులు నియ