ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యేడవ ప్రకరణము

195


చోటు నేనెఱుంగుదు' ననెను. మహేంద్రుఁడు తల యెత్తి చూచి 'నీ వెవ్వరని యడిగెను.

సత్యానందుఁడు, కొంచెము కోపము దాల్చి, ముఖమును పైకెత్తి చూచుచు “నవీనానందా! నిన్ను వెడలి పొమ్మని యిదివఱకే సెల విచ్చి యుంటిని. ఇంకను ఇచ్చట నేల యున్నావు?” అనెను.

శాంతి కొమ్మపై నుండియే "ప్రభూ! స్వర్గలోకమందును మర్త్యలోక మందును తమ కధికారము కలదు. చెట్టుకొమ్మపైనను గలదా?" యనెను.

ఇట్లని శాంతి కొమ్మపై నుండి తటాలున క్రిందికి దుమికెను.

సత్యానందుఁడు మహేంద్రునిఁ జూచి, "ఇతఁడు నవీనానందగోస్వామి. అతిపవిత్రాత్ముఁడు: నా ప్రియ శిష్యుఁడు. ఇతఁడు నీ కొమార్తెను వెదకి పిలుచుకొని రాఁగలం”డని చెప్పి, శాంతికి కనుసన్న చేసెను. శాంతి నమస్కరించి సెలవు గైకొని యెను. అప్పుడు మహేంద్రుడు మరల “ని న్నెచ్చటఁ జూడ నగు" నని యడిగెను.

శాంతి 'నాయాశ్రమంబునకు రావచ్చు' నని చెప్పి వడివడిగాఁ బోయెను.

మహేంద్రుడు బ్రహ్మచారికి మ్రొక్కి, సెలవు గైకొని శాంతితోడ నామె యాశ్రమంబునకుఁ బోయెను, ఇంతలో రాత్రి కాల మాయెను. అట్లుండినను శాంతి విశ్రమింపక నగరాభిముఖియై చనెను.

అందఱును వెడలిపొయిన మీఁద బ్రహ్మచారి యొకఁడే