ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదటి ప్రకరణము

15

అప్పుడు మహేంద్ర సింహుఁడు “నీవు ఏయాయుధ మును తీసికొని రాఁగలవు?" అనెను.

ఇంటిలోపలికి బోయి కల్యాణి, ఒకబరిణెను దాఁచికొని వచ్చెను. ఇంతకుమురువే యేదేని కష్టము సంభవించినప్పుడు ప్రాణాత్యాగము చేసికొనవచ్చు నని తలంచి విషమును సంగ్ర హించి యుంచెను, ఆబరిచెయే యది.

జ్యేష్ఠమాసము, ఎండ వేడిమి చెప్పతరము కాదు. భూమి నిప్పున నుండెను. ఆకాశము కాఁగిన తామ్రమువలె నుండెను. నేలపై కాలూనినయెడల బొబ్బలు పొక్కు చుండెను. కల్యాణీ యెండతాపమునకు తాళ్ళ శరీరమంతయు చెమటచే తడిసినదై, బడలి, నిలువనీడ లేక, అక్క డక్కడ నెండియున్న చెట్లనీడల నిలుచుచు, ఒకటిదానికొకటి చాలాదూరములోనున్న గుంటలలోని బురదనీళ్లు త్రాగుచు, మహాకష్టముతో నడిచెను. బిడ్డ, మహేంద్ర సింహునియుద్ధ నుండెను. వాఁడు బిడ్డకు ఎండ వేడిమి తాఁకనీక మాటిమాటికి గుడ్డతో విసరుచుండెను. ఆమార్గమున శ్యామలపత్రములతో శోభితమై సుగంధకుసుమయుక్తమైనట్టి లతా వేష్టిత మైన యొక వృక్షచ్ఛాయయందు వారిర్వురును గూర్చుండి విశ్రమించిరి. మహేంద్రుఁడు కల్యాణిశ్రమసహనమును గాంచి, ఆశ్చర్య మొంది గుడ్డను తడిపి తెచ్చి ముఖముమీఁదను కాళ్లమీఁదసు పిడిచి తాపోపమనము చేసెను.

కల్యాణికి కొంచెము బడలిక తగ్గాను. అయినను, దంపతు లిర్వురుకు ఆకలిచే డస్సినవారైరి. వీరు ఓర్చుకొనియుండిరి. గాని, బిడ్డ నీరునట్టు చే తపించుచుండెను. బిడ్డనిమిత్త మెచ్చటనైన