ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

ఆనందమఠము


అప్పు డానల్వురును బ్రహ్మచారికి నమస్కరించి లేచి నిలువంబడిరి. సత్యానందుఁ డితరులకుఁ దెలియనీక సంజ్ఞ చేసి మహేంద్రుని నిలుపుకొనియెను. మిగిలిన ముగ్గురును వెడలి పోయిరి. సత్యానందుఁడు మహేంద్రునితో “మీరందఱును విష్ణు మందిరమున ప్రతిన వల్కి సంతానుల ధర్మమును గ్రహించితిరి. భవానందుఁడు, తా నొప్పుకొనియుండిన ప్రాయశ్చిత్త మునకు నేఁడు లోఁబడియెను, జీవానందుఁడు సహిత మెన్నఁడు ప్రాయశ్చిత్తమునకు లోఁబడి ప్రాణమును ద్యజించునో? అని నాకు భయమై యున్నది. అయినను నాకొక నమ్మక మున్నది. ఏమన, ఒకానొక నిగూఢమగు కారణముచే నతఁడు ప్రకృతమునఁ జచ్చుట కిష్టము గలవాఁడుగా 'లేదు. నీవొక్కఁడవే ప్రతినను గాపాడుకొని యున్న వాఁడవు. ఇప్పుడు సంతానుల కార్యోద్ధార మాయెను. సంతానుల కార్యోద్ధార మగువఱకే నీవు నీ పెండ్లము బిడ్డల ముఖము చూడఁగూడదు; ఇప్పుడు సంతానుల కార్యము ఉద్ధరింపఁ బడెను. ఇఁక నీవు గృహస్థుఁడవు కావచ్చు” ననియెను.

మహేంద్రుని కన్నులనుండి నీరు ప్రవహించుచుండెను. కొంతవడికి మహేంద్రుఁడు, "స్వామీ! ఎవ్వరిని బొంది గృహస్థుఁడ నగుదును? భార్య ఆత్మ ఘాతినియై పోయేను. ఇంక నా బిడ్డ యెక్కడ చున్నదో నే నెఱుంగను. ఎక్కడ దొరకును ? బ్రతికియున్న దని సెల విచ్చియుంటిరి. ఇంతేకాక "వేఱేమియు నెఱుంగ" ననియెను.

తలపై చెట్టుకొమ్మయం దేవరో యుండి, 'బిడ్డ యుండు