ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యేడవ ప్రకరణము

193


కొల్లగొట్టుకొని యిండ్లకుఁ బోయి చేరుదురు, ఎవ్వరును కనఁబడ లేదు. నే నిప్పుడే వెదకి చూచి వచ్చినాఁడను.

సత్యానందుఁడు విషణ్ణుఁడై , "ఎట్లయినను కానీ, నగరము తక్క సమస్తమైన వీరభూమి మనస్వాధీన మై యున్నది. నగరము బయట మనకుఁ బ్రతికక్షు లైనవా రెవ్వరును లేరు. కనుక, మీరు వీరభూమియందు సంతాన రాజ్యమునుఁ జేయుఁడు, ప్రజలచే పన్ను గొనుఁడు. మఱియు, నగరమును మన యధికారమునకు లోఁబఱిచి కొనుటకు సైన్యమును సంగ్రహింపుఁడు. హిందువుల రాజ్య మైనది యని విన్నచో ననేకులు సంతాన సైన్యము ననుకరింపఁగలరు.” అని చెప్పెను.

అపుడు, జీవానందుఁడు మొదలగువారు సత్యానందునికి మ్రొక్కి, “మేము నమస్కరించు చున్నారము, ఓమహా రాజాధిరాజా ! అనుజ్ఞ నిండు; మేమీ కాననమునందే తమ సింహాసనమును స్థాపించెదము" అనిరి.

సత్యానందుఁడు పుట్టినది మొదలు కోప మెఱుఁగనివాఁడు, నేఁడు ప్రథమ కోపమును బ్రకాశింపఁ జేసి, 'చీ ! నన్నొక మూర్ఖునిగాఁ దలంచితిరా? మన మెవ్వరమును రాజులము కాము——మనము సన్న్యాసులము—— ఈ దేశంబున కంతయు సాక్షాత్ వైకుంఠ నాథుఁడే రాజు. నగరము మన యధికారమునకు లోఁబడఁగానే మీ కెవరియం దిష్టమో వాని శిరమున రాజమకుటము నుంపుఁడు. నేనుమాత్ర మీ బ్రహ్మచర్య వ్రతమును మాని యితరాశ్రమమును స్వీకరింపను, ఇది ఖండిత ముగాఁ దెలిసి యుండవలయును. ఇప్పుడు మీ మీ పనులకుఁ బోవనగు" ననియెను.