ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

ఆనందమఠము


భక్తులైనందున దహనము చేసెదరు.) పిదప కాననమందు సత్యానందుఁడు, జీవానందుఁడు, మహేంద్రుఁడు, నవీనానం దుఁడు, ధీరానందుఁడు అగు వీరు మాత్రమే కూర్చుండి యుండిరి. ఈయైదుగురును ఏకాంతముగా పరామర్శ చేయుచుండిరి. అపుడు, సత్యానందుఁడు, “ఇన్ని దినములు మనము దేని కొఱకై సర్వధర్మమును సర్వసుఖమును త్యజించి యుంటిమో యావ్రతము నేడు సఫల మాయెను ఈ ప్రదేశమున యవనుల సైన్యము లేదు. అవశిష్టమై యున్నవారు సైతము మన ముందు నిమిషమైన నిలువ లేరు. ఇప్పుడు మీ రేమి చెప్పిదరు?" అనెను.

జీమానందుఁడు, 'దయ చేయుఁడు; ఈసమయము పోయి నగరాధికారమును వహింత' మనియెను.

సత్యానంద—— నామతమును అదే.

ధీరానంద——సైన్య మేది ?

జీవానంద——ఏల! మన సైన్యము.

ధీరానంద——సైన్య మిం కెక్కడ ? ఎవరైనఁ గనఁబడు చున్నారా ?

జీవానంద——అచ్చటచ్చట విశ్రమించి యుండవచ్చును. భేరి మ్రోగించినచో నందఱును వచ్చి చేరుదురు.

ధీరానంద——ఒక్కఁడును లేఁడు,

జీవానంద——అ దేల ?

ధీరానంద——అందఱును కొల్లగొట్టుటకై పోయి యున్నారు. గ్రామములన్నియు నిపు డరక్షితము లై యున్నవి. ముసల్మానుల గ్రామములను, పట్టుపని చేయు కార్ఖానాలను