ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది యేడవ ప్రకరణము

191


ధోత్సవములను జరుప నారంభించిరి.సత్యానందుఁడుమాత్రము భవానందుని మరణముచే వ్యాకులచిత్తుఁడై యుండెను.

ఇదివఱకును వైష్ణవులకు రణవాద్యము లధికముగా నుండ లేదు. ఇప్పుడు భేరి, కాహళము, తమైట, నగారా, డోలు, డమరు, శంఖము, జయఘంట మొదలగు నానావిధ వాద్యము లెచ్చట నుండియో వచ్చి తుముల శబ్ద మయ్యెను. ఈ జయ సూచక వాద్యములచే కాననము ప్రాంతరము నదు లాదిగాఁ గల ప్రదేశములందు ప్రతిధ్వని పరిపూర్ణముగా నిండిపోయెను, ఈవిధముగా సంతానులు పెద్ద ప్రొద్దు నానావిధోత్సవములను జరిపినపిదప సత్యానందుఁడు, “జగదీశ్వరుఁడు నేఁడు కరుణించెను; సంతానధర్మంబునకు జయమాయెను; అయిన నొకపని నిలిచెను; ఎవఁడు మనతో నీ యుత్సవమునఁ జేర లేదో, ఎవఁడు మన యుత్సవముకొఱకై ప్రాణము నిచ్చెనో, యట్టి వానిని మఱచుట సరికాదు; ఎవఁడు రణక్షేత్రమునందు నిహతుఁడై పడి యున్నాఁడోవానికి సత్కారము చేయుదము రండు; ఆ మహాత్ముడు మనకొఱకై యీరణజయంబును బోంది ప్రాణత్యాగమును జేసి యున్నాఁడు; మహావైభవముతో నా భవానంధుని సత్కరింపుము” అని చెప్పెను. అప్పుడు సంతానులు “వందేమాతరం” పాడుచు నిహతుఁడైన వానిసత్కారము నకై వెడలిరి. బహుజనులు గుంపుగాఁ జేరి హరిస్మరణము చేయుచు చందనకాష్ఠంబులను (అప్పుడు ఫారెస్టు అనఁగా: అడవి యిలాఖావారి సంకటము లేదు.) మోచికొనివచ్చి యెక చితి నేర్పఱచి, “హరే మురారే” యని గానము చేయుచు, చితికిఁ బ్రదక్షిణము చేసిరి, (వీరు వైష్ణవసంప్రదాయంబున జేరిన విష్ణు