ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియాఱవ ప్రకరణము

187


‘కొట్టుఁడు, పట్టుఁడు' అని జీవానంద భవానంద ధీ రానందు లందఱును విధర్మ సేనను వెన్నంటి చనిరి, వారి ఫిరంగులను సంతానులు లాగుకొనిరి. బహుజను లాంగ్లేయ సిపాయీలు నిహతులైరి. సర్వమును నాశ మైనదానిని జూచి హే, వాట్సన్ వీరు భవానందుని చెంతకుఁ బోయి. “ మేము బందీల మయ్యెదము; ఇఁక ప్రాణహత్య చేయఁగూడదు” అని ప్రార్థించిరి. జీవానందుఁడు భవానందుని ముఖమును జూచెను. భవానందుఁడు మనస్సున, 'అది కాఁజాలదు; నేను నేఁడు చావవలయును' అని చెప్పి, 'కోట్టుఁ' డని యఱచెను. మరల నొక ప్రాణి మిగుల లేదు. తుద కొకచోట మాత్రము ఇరువది ముప్పదుగురు ఎఱ్ఱ జనులు గుంపుగా నిలిచి యాత్మ సమర్పణమున కృతనిశ్చయులై యతిఘోరతర మైన యుద్ధము చేయ నారంభించిరి. జీవానందుఁడు, “భవానందా! మనకు రణజయమై యున్నది. ఇంక నీదినమున వద్దు, ఈకొందఱు తప్ప మఱి యెవ్వరును లేరు. వారికిఁ బ్రాణదానము నొసఁగి పోదము ర” మ్మనియెను. 'ఒక్కఁడు ప్రాణముతోనుండినను వెనుకకువచ్చుట లే'దని భవానందుఁడు చెప్పెను. జీవానందుఁడు, “నీపై ఆన నుంచి చెప్పెదను, కొంచెము దూరమున నిలిచి చూడుము; ఇంతమంది యింగ్లీషుజనులను నే కొక్కఁడ నే నిహతులం జేసెద"ననియెను.

కేష్ట౯ థామసు గుఱ్ఱముపై నిబద్ధుఁడై యుండెను, భవానందుఁ. “డీ యధముని దెచ్చి నాయెదుటఁ బెట్టుఁడు; వీనినిఁ గొట్టి నేనునుం జచ్చెద" ననెను.

కేష్ట౯ థామసునకు దేశ భాష వచ్చును. అతఁడు యిం