ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

ఆనందమఠము


మైన ఫిరంగీల శ్రేణి సప్తదశముఖములనుండి హేదొర యొక్క దళమునం దగ్నివృష్టిని గురియించుచుండెను. ఆఘోరశబ్ద ముచే వన నద గిరు లన్నియు ప్రతిధ్వనితము లాయెను. పగలంతయు రణమున శ్రమపడిన యవనసైన్యము ప్రాణభయ ముచే వడవడ వడంకెను. ఆయగ్ని వ్రుష్టి చే ముసల్మానులు, హిందూస్థాను లందఱును పలాయన సూక్తపరాయణు లగు చుండిరి. కేవలము నలుగురు ఎఱ్ఱమూతివారు మాత్రము చక్కఁగా నిలిచి మరణమునకు సిద్దు లైరి. భవానందుఁ డీవినో దమును చూచుచు, "భ్రాత్రులారా! తురకలు భగ్నులై పరుగిడుచున్నారు; పదండి, వారిని వెన్నఁటుద” మనియెను.

అప్పుడు సంతానులు పిపీలికాహ ప్రవాహమువలె నూతనోత్సాహముచే నానకట్టనుండి వెనుకకుఁ దిరిగివచ్చి యవనుల నాక్రమించుటకై పరుగిడిరి. అకసాత్తుగా వారు యవనులపైఁ బడిరి; యవనులకు మరల యుద్ధంబున కవకాశము దొరక లేదు. భాగీరథీతరంగ మేలాగున దంభ కారియు, మహాపర్వతాకారముననైన మత్తగజమును దేలించుచు తీసికొనిపోవునో, ఆలాగున సంతానులు యవనులను దేల్చికొని పోయిరి. యవనుల వెనుక భాగమున భవానందుని కాల్బల ముండెను. ముందు భాగమున మహేంద్రుని ఫిరంగిగుం డ్లుండెను. అప్పుడు హేదొరకు సర్వనాశముసంభవించేను, ఇంకేమియు మిగుల లేదు. బలము వీర్యము సాహసము కౌశలము శిక్ష దంభము అన్నియు పోయెను, ఫౌజుదారీ, పాదుషాహి, ఇంగిలీషు, దేశి, విలాయతి, నల్లవారు, ఎఱ్ఱవారు, అందఱును నిపాతమై నేలం బడిపోయిరి. విధర్ముల సైన్యము పలాయనమై పోయెను.