ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియాఱవ ప్రకరణము

185


నుంచి పొం” డనెను. పందొమ్మండ్రు అల్పవయస్కులు భవానందుని సహాయమునకై నిలిచిరి.

అనంతము పెక్కండ్రు సంతాను లానకట్టను దాఁటి జీవానంద ధీరానందుల యాజ్ఞానుసారముగ నావలిగట్టు జేరిరి. భవానండుఁ డొక్కఁడే పందొమ్మండ్ర సహాయముచే నాఫిరంగితో బహుసైన్యమును హతము చేయ నారంభించెసు అయినను యవన సైన్యము జలోచ్ఛ్వాసమునఁ బుట్టిన తరంగ తండములవలె భవానందునిఁ జుట్టుకొని యతనిని మునిఁగినవానిఁగా జేసెను. భవానందుఁడు, అజయ్యుఁడు; అశ్రాంతుడు; నిర్భీతుఁడు ఫిరంగియొక్క ప్రతి గుండు దెబ్బకు ననేక సైన్యమును నష్టపఱచెను. యవనులు గాలిచే పీడితమైన తరంగముయొక్క, అభిఘాతమువలె నతనిపైఁ; బడుచుండిరి. అయినను, ఆపందొమ్మిదిమంది సంతానులు ఫిరంగితో ఆనకట్ట ద్వారమును బంధించికొని యుండిరి. వారు చచ్చినవారై యుండినను జావ లేదు. యవనులచే ఆనకట్టను మెట్టుటకు కాలేదు. ఆ బాలవీరులును అజయ్యులు, వారి జీవనము అవినశ్వరము ఇంతలో ముందు పోయిన సంతాన సైన్యమునందు చాలభాగము గుంపులుగుంపులుగా నావలిగట్టునకు పోయి చేరిరి. ఇంకను గొంచెముసేపు ఆనకట్ట ముఖమును రక్షించుకొని యుండినచో నందఱును దాటిపోయి యుందురు. ఈసమయంబున మఱియొక చోట ఫిరంగిశబ్దము వినఁబడెను. ఉభయపక్షములవారు యుద్ధము నందు క్షాంతులై చెవి యొగ్గి వినిరి. మఱెక్కడ నుండి ఫిరంగులు? చూడఁగా వనమధ్యమునుండి కొందఱు దేశ్యజను లెగిరిం చెడిగుండ్లు వచ్చుచుండినవి. ఇట్లు వచ్చి యావిరాటరూప