ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

ఆనందమఠము


ఆనకట్టపైఁ బోయెను. ఆనకట్ట సమీపమున అనేక సంతాను లొక్కసారిగా పోవుట యాంగ్లేయులకు చాల అనుకూల మా యెను. ఆనకట్ట ఊడ్చినయ ట్లగుట కారంభించెను. సంతానులు గుంపులు గుంపులుగా వినష్టు లగుచు వచ్చిరి భవానందుఁ డును జీవానందుఁడును ధీరానందుడును నుండిరి. ఒక గుండు దెబ్బకు బహుజన సంతానక్షయ మాయెను. భవానందుఁడు, “జీవానందా! ధీరానందా ! రండు, మనము మువ్వురమును కత్తులనుఁ ద్రిప్పుచు పోయి యాఫిరంగులను లాగుకొంది” మనెను. అట్లే ముగ్గురును కత్తులను ద్రిప్పుచు ఫిరంగులసమీపమునకుఁ బోయి యచ్చటనుండిన సైన్యమును గొట్టి వేసిరి. దానిని గాంచి, యింకను కొందఱు సంతానులు వారి సహాయమునకు జనిరి, ఫిరంగి భవానందుని చేతఁ జిక్కెను. భవానం దుఁడు దానిపైఁ గూర్చుండి కరతాళధ్వని చేయుచు “వందేమాతరం” పొటపాడుఁ డని చెప్పెను. అందఱును “వందేమాతరం" పాడిరి. భవానందుఁడు, జీవానందా! ఈ ఫిరంగిని త్రిప్పి యుంచుకోని యీయధమాధములను కాల్చి బూడిద చేసి వేయుద" మనెను. అనంతరము సంతానులు చేరి ఫిరంగిని శత్రువులవైపు త్రిప్పిరి, అప్పుడు ఫిరంగి ఉచ్చనినాదముతో వైష్ణవుల చెవియందు “హరీహరీ” యని శబ్దము చేయునట్లు శబ్దమాయెను. అందు వలన సిపాయీ లనేకులు నష్టమైరి. భవానందుఁ డాఫిరంగి నీడ్చుకొనివచ్చి ఆనకట్టకొనయందుంచి కొని, మీ రిరువురును సంతాన సైన్యమును ఆనకట్ట మీఁదుగా తీసికొనిపొండు, నే నొక్కఁడనే యీ వ్యూహముఖమును రక్షించుకొని యుండెదను; ఫిరంగిని కాల్చుటకుఁ గొందఱను