ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియాఱవ ప్రకరణము

183


టకు కాదయ్యెను, కొందఱు పరువిడిపోయి ఆమ్ర కాననము నాశ్రయించిరి. మిగిలిన వారిని జీవానందుఁడును ధీరానందుఁడును ఆనకట్ట మీదుగా బిలిచికొని పోయిరి. అచ్చట 'హేయును వాట్సనును రెండు ప్రక్కలనుండి వచ్చి చుట్టుకొనిరి. ఇఁక వీరి యత్నము తప్పినది.


ముప్పదియాఱవ ప్రకరణము

సంతానులు ఆంగ్లేయుల ఫిరంగిని గైకొనుట

ఇంతలో థామసుని ఫిరంగి సైన్యము కుడివైఫువచ్చి చుట్టుకొనెను. అప్పుడు సంతానుల సైన్యము ఛిన్న భిన్న మాయెను. ఎవ్వరికిని తప్పించుకొనెడియాశ లేకపోయెసు, సంతానులు దిక్కుదిక్కునకుఁ బాఱ నారంభించిరి. జీవానందుఁడును ధీరానందుఁడును వారిని నిలిపి యొకస్థలమునఁ జేర్చుటకుఁ బ్రయత్నపడిరి; అది నిష్ఫల మాయెను. ఆసమయంబున గట్టిగా, ఆనకట్టమీదుగాఁ బోయి 'ఆవలికి పొండు ! లేకున్న నదిలో మునిగిపోదురు, మెల్ల మెల్లగా ఆంగ్లేయుల వైపు చూచుచుపొండు,' అనుశబ్దము వినవచ్చెను.

జీవానందుఁ డాశబ్దము వచ్చినవైపును చూడఁగా, ముందు ప్రక్కను భవానందుఁడుండెను. భవానందుఁడు, జీవానందా! ఆనకట్టపై దీసికొని పొమ్ము; ఇఁక యత్నము లేదు' అనెను. అప్పుడు మెల్ల మెల్లగా భయపడుచు సంతాన సైన్యము