ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ఆనందమఠము


సంతానులను బిలిచి, యీస్వల్ప సైన్యమును జంపివేసి మనము జీవానందుని సహాయంబునకుఁ బోవలయును. మీరింకొక తూరి “జయ జగదీశ హరే” యని చెప్పుఁ డనియెను. అపుడాస్వల్బజన సంతానులు “జయ జగదీశ హరే” యని నుడువుచు పులులవలే కేష్ట౯ థామసుపైఁ బడిరి. ఆపడిన వేగమున నాయల్ప సంఖ్య గల సిపాయీ లందఱును హతులైరి. అప్పుడు భవానందుఁడు తానేపోయి కేప్టర్ థామసును పట్టుకోనెను. కేప్ట౯ థామసు కడవఱకును యుద్ధము చేసెను. భవానందుఁడు 'కేష్ట౯ దొరవారూ నిన్ను చంపుట లేదు. ఆంగ్లేయులు మాకు శత్రువులు కారు. తురకలకు సహాయముగా మీరేల వచ్చితిరి? 'రా—— నీకుఁ బ్రాణదాన మొసఁ గితిని. నీ వేమో యిప్పుడు బంది వైతివి. ఆంగ్లేయులకు జయ మగుఁగాక; మేము మీ హితచింతకులము.' అని చెప్పెను, అప్పుడు థామసు భవానందునిఁ జంపుటకై తుపాకి నెత్తుటకుఁ బ్రయత్నించెను. అయినను, భవానందుడు పులివలే నతనిం బట్టుకొని యుండినందున, థామసు ప్రయత్నము కొనసాగలేదు. భవానందుఁడు 'ఇతనినిఁ గట్టి వేయుఁ' డని యనుచరుల కనుజ్క్ష చేసెను, ఇద్దరు ముగ్గురు సంతానులు వచ్చి 'థామసును గట్టి వేసిరి. పిదప, భవానందునియానతి మేరకు నతనిని గుఱ్ఱముపై నెక్కించికొని " వందేమాతరం ” పాడుచు వాట్స౯ ఉండిన వైపునకుఁ జనిరి.

జీవానందుని సంతాన సైనికులు భగ్నోద్యము లై పలా యనోద్యక్తులై యుండిరి. జీవానందుఁడును ధీరానఁదుఁడును వారికి ధైర్యము చెప్పి నిలిపిరి. అయినను, అందఱను నిల్పు,