ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

ఆనందమఠము


లేయుల గుండ్ల వృష్టి నుండి తప్పించుకొని సంతానుల సైన్యమును, అజయ నదీజలమునందు ముంచెదవా?

జీవానంద——అజయనదికి ఆనకట్ట యున్నట్లు జ్ఞాపకము.

భవానంద—— ఈపదివేగురు సంతానులను ఆనకట్ట మీఁదుగ దాఁటింపఁ బ్రయత్నించినను, ఒక వేళ యింగ్లీషువారు ఫిరంగి కాల్చిరేని అందఱును చచ్చి పోవుదురు.

జీవానంద——ఒక పనిచేయుము. కొద్దిసేనను నీవు తీసికొని పో. ఈ యుద్ధమునందు నీవు చూపియుండు సాహసమును చాతు ర్యమును జూచినయెడల నీది నీకసాధ్యము కాదు. నీవు స్వల్ప సంఖ్యగల సంతాన సేన నుంచుకొని తప్పించుకొనుదారిని జూచి కొనుము, నేను నీ సేనమఱుఁగుననుండి . మిగిలిన సంతానులను ఆనకట్టమీఁదుగా దాఁటించి గొనిపోయెదను. నీతో నుండిన వారేమో నష్టమయి పోవలసినదే; నాతోడ వచ్చువారు మాత్రము తప్పించుకొందురు.

భవానంద——మంచిది, అట్లే చేసెదను,

అప్పుడు భవానందుఁడు రెండు వేల మంది సంతానులను బిలిచికొని, మరల “వందేమాతరం” శబ్దముతో నత్యంతో త్సాహముగా నాంగ్లేయుల ఫిరంగిసైన్యమును ఆక్రమించెను. అచ్చట ఘోరతరమైన యుద్ధమారంభ మాయెను. అయినను, ఫిరంగులముందు సంతానుల స్వల్పసైన్య మెంతకాలము నిలుచును? పైరును కోఁతకోసి పడవేయునట్లుగా నాసంతానులు భూమిపైఁ బడిరి.

ఇంతలో జీవానందుఁడు మిగిలిన సంతానులను కొంచెము ఎడమప్రక్కగా త్రిప్పి కాననము నాక్రమించికొని మెల్ల మెల్ల