ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్ప దినాలుగవ ప్రకరణము

175


జీవానంద—— చెప్పుటకుఁ గాదు, చెట్లకొమ్మ లడ్డముగా నున్నవి, వారు బయటికి రాలేదు.

సత్యానంద—— ఎఱ్ఱ మూతివారా? లేక ఉత్తసిపాయీలా?

జీవానంద——ఎఱ్ఱమూతివారుకూడ నున్నారు, అని చెప్పుచు చెట్టునుండి దిగెను.

సత్యానంద——పదిగురు సంతానులు సిద్ధముగ నున్నారు. ఏమి చేయుదువో, చూడుము, నీవు దీనికి సేనాపతివి.

దీనిని విని, జీవానందుఁడు సశస్త్రుఁడై సజ్జితుఁడై ఒక్క యెగురున గుఱ్ఱము నెక్కెను. ఒకతూరి నవీనానందుని వైపు తిరిగిచూచి కనుసన్న చేసెను. అదేమి సంకేతమో యెవరికినిఁ దెలియ లేదు.” నవీనానందుఁడు కనుసన్న చే నేమి యుత్తర మిచ్చినదియు నెవ్వరికిని దెలియ లేదు. వారివారి మనస్సు నందు పరస్పర మిదియే కడపటి దర్శన మని భావించియుండ వచ్చును. అప్పుడు నవీనానందుఁడు దక్షిణబాహువును పైకేత్తి యందఱను జూచి "భ్రాతృలారా ! ఈ సమయమున“జయజగదీశ హరే' యని ప్రార్థింపు" డని చెప్పెను. అప్పుడా పది వేలసంతాను లేకకంఠముతో నది కానన గగనములు సైతము ప్రతిధ్వని చేయునట్లును, గుండ్ల శబ్దమును ముంచి వేయునట్లును చేతులు నెత్తుకొని,

జయజగదీశహరే
మ్లేచ్చనివహనిధ నే కలయసి కరవాలమ్.

అని పాడిరి.

ఈసమయంబున నాంగ్లేయుల గుండ్ల వాన కాననమధ్య మందు సంతానులపై గురిసెను. అనేకులు పాటపాడుచుండి ఛిన్నమస్తకులై ఛిన్న బాహువులై ఛిన్న హృదయులై నేలకు