ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

ఆనందమఠము


తానుసారముగఁ జెప్పికొనుచుండిరి పదివేగురియొక్క కలకల రవమును, మంద వాయువుచే తాడితమైనందునఁ గల్గిన వృక్ష పత్ర రాశియొక్క మర్మరశబ్దమును, సైకత వాహినియైన తరంగిణీయొక్క మృదువైన తరతరవమును, నీలాకాశమునందలి చంద్ర తారలును, శ్వేత మేఘ రాశియును, శ్యామలమైన ధరణీ తలము నందలి పచ్చగానుఁడు నరణ్యమును, స్వచ్ఛమైన తెల్లని యిసుకయును, ఫుల్లకుసుమదామము లును, మఱియు మద్య మధ్య సకలజన మనోహరంబగు 'వందేమాతరం' ఘోషమును, మిళితమై యుండు సమయమున, సత్యానందుఁడు వచ్చి, యాసంతానులమధ్య నిలిచెను. ఆప్పు డాదశ సహస్రసంతాన మస్తకములు, చెట్ల సందులనుంచి ప్రసరించిన చంద్ర కిరణములచే ప్రభాసితమైన శ్యామల తృణావృత భూమియందుఁ బ్రకాశించెను. సత్యానందుఁడు అత్యుచ్చధ్వనిచే నశ్రుపూర్ణ లోచనుఁడై రెండు చేతులను పైకెత్తి చెప్పదొడంగెను:——

శంఖచక్ర గదాపద్మ ధారియును, వనమాలా విభూషితుఁడును, వైకుంఠ నాథుఁడును, కేశిమథనుఁడును, మధు ముర నరక మర్ధనుఁడును లోకపాలకుఁడు అగు శ్రీహరి మీకు మంగళము నిచ్చును గాక. మీభుజములయందు బలము నిచ్చును గాక. మనస్సున భక్తి నిచ్చును గాక, ధర్మంబున బుద్ధి నుంచును గాక. మీరంద ఱేక గ్రీవముగ నతని మహిమాను వర్ణనగీతమును పాడుఁ డనినంతనే యా వేలకొలఁది జనుల కంఠములనుండి ఉచ్చస్వరముతో,

జయ జగదీశ హరే
ప్రళయ పయోధి జలే ధృతవానసి వేదమ్

.