ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది మూఁడవ ప్రకరణము

171


వచ్చి చేరిరి. వెన్నెలరాత్రి యందు అజయనదీ పార్శ్వమున నుండు పెద్ద యడవిలో ఆ ఆమ్ర పనస తింత్రిణి వటాశ్వత్ధ శాల్మలీ వృక్షాదులచే నలంకృతమైన యా మహాగహనమునందు పదివేల సంతానులు చేరిరి. అపు డందఱును పరస్పరము సత్యానందుని ఆగమనవార్త విని కోలాహలధ్వని చేయుచుండిరి. సత్యానందుఁ డెచ్చటి కేమి పనిగాఁ బోయియుండెనో యది యెవ్వరికిని దెలియదు. అయినను, వదంతి యేమనఁగా—— అతడు సంతానుల మంగళా కాంక్షియై తపస్సు చేయుటకు హిమాలయమునకుఁ బోయియుండెననియును, ఆమహాస్వాముల తపస్సు సిద్ధి యైనదనియును, మనకు రాజ్యము వచ్చు ననియును మిక్కిలి కోలాహలము చేయుచు, కొట్టుఁడు, పట్టుఁడు, తురకలను చంపుఁడు' అని చీత్కారము చేయుచుండిరి. కొందఱు జయ,జయ మహాస్వాములకు జయ జయ, అని యఱచిరి. కోందఱు “హరేమురారే మధు కైటభారే”యని పాడిరి. కొందఱు “వందే మాతరం” పాడిరి. కొందఱు 'అన్నా! తుచ్ఛ బంగాళీలకై రణరంగమున నీ శరీరమును విడిచి పెట్టవలసిన దినము వచ్చె' ననిరి. కొందఱు 'అన్నా ! మసీదులను గొట్టి ధ్వంసము చేసి 'రాధామాధవ మందిరములను కట్టుదినము వచ్చెననిరి. కొందఱు తాను సంపాదించినదానిని తా ననుభవించు దినము వచ్చె' ననిరి. కొందఱు 'వర్ణాశ్రమ హీనుల మై యుండక నిర్బాధకముగా మరల వర్ణాశ్రమమును గ్రహించు దినము వచ్చె' ననిరి. కోందఱు ఈ అరాజకము తప్పునా? ఈ జాతిపక్షపాతము తప్పిపోవునా? శిష్టాచరణమందు బుద్ధి కలుగునా ! ' యనిరి. ఇట్ల నేకు లనేక విధములుగా తమతమ యభిమ